Home » Hai Nanna Review : హాయ్ నాన్న..నాని ఖాతాలో మరో హిట్ పడ్డట్టేనా..?

Hai Nanna Review : హాయ్ నాన్న..నాని ఖాతాలో మరో హిట్ పడ్డట్టేనా..?

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరో నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాని ప్రతిసారి మినిమం హిట్ సినిమాలు మాత్రమే చేస్తాడు. అయితే మొన్న దసరా సినిమా విజయం తరువాత… నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న. దసరా మూవీ ఫుల్ మాస్ అయితే… హాయ్ నాన్న ఫుల్ క్లాస్ మూవీ.నాని హీరోగా చేసిన హాయ్ నాన్న సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తున్నారు. బేబీ కియరా కన్నా ఈ సినిమాలో కీలకపాత్ర చేస్తోంది. మనసుకు హాయినిచ్చే ప్రచార వీడియోస్ మరియు పాటలు ఇందులో ఉన్నాయి. తెలుగుతోపాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషలలో హాయ్ నాన్న సినిమా రిలీజ్ అయింది.

Hi-nanna-Review

Hi-nanna-Review

 

కథ మరియు వివరణ

Advertisement

 

హీరో నాని చేసిన హాయ్ నాన్న సినిమా కథ విషయానికి వస్తే… ఈ సినిమాలో విరాజ్ (నాని) ఒక ఫోటోగ్రాఫర్. సొంత స్టూడియో పెట్టుకుని ముంబైలో మోడల్స్ కు ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తూ ఉంటాడు నాని. ఫోటోగ్రాఫర్ గా పని చేస్తూనే తన కూతురు మహితో (కియారా ఖన్నా) కలిసి నివసిస్తూ ఉంటాడు. ఇంతలోనే తన కూతురుకు ఓ అరుదైన వ్యాధి వస్తుంది. దీంతో తన కూతురిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు హీరో నాని. అయితే చిన్నప్పటి నుంచి అమ్మ గురించి తెలియకుండా పెంచడంతో అమ్మ కథ చెప్పమని… నానిని తరచూ అడుగుతూ ఉంటుంది మహి. అయితే నాని చెప్తానని చెప్పకపోవడంతో ఇంట్లోంచి వెళ్ళిపోతుంది తన కూతురు మహి.

Advertisement

 

అనుకోకుండా యాష్ణా (మృణాల్ ఠాకూర్ ) మహికి పరిచయం అవుతుంది. దీంతో హీరోయిన్ మరియు మహి ఇద్దరూ మంచి స్నేహితులు అవుతారు. హీరోయిన్ వల్ల నాని కూతురు మహికి అమ్మ కథ చెప్పాల్సి వస్తుంది. అయితే మహి వాళ్ళ అమ్మ ఎవరు ? యష్ణ… హీరో నాని లైఫ్ లోకి ఎందుకు వచ్చింది ? హీరో నానితో ఏం సంబంధం? అసలు హీరో నాని కూతురుకు ఎలాంటి హెల్త్ ఇష్యూ వచ్చింది ? అనేది తెలియాలి అంటే సినిమా థియేటర్లో చూడాల్సిందే. ఇక హాయ్ నాన్న సినిమాలో హీరో నాని యాక్టింగ్ అదరగొట్టేశాడు. నాని కూతురు పాత్రలో నటించిన మహి కూడా అందరిని ఎమోషనల్ మూడ్లోకి తీసుకువెళ్తుంది. అటు హీరోయిన్ మృణాల్ ఠాకుర్ ఇందులో అందంగా కనిపించడమే కాకుండా తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఎమోషన్ సీన్స్ అందరినీ కదిలిస్తాయి.

 

 

పాజిటివ్ పాయింట్స్

హీరో నాని

సెంటిమెంట్ సీన్స్

మృణాల్ ఠాకుర్

దర్శకత్వం

 

మైనస్ పాయింట్స్

సాగదీత

కామెడీ మిస్సింగ్

మ్యూజిక్

 

రేటింగ్ 2.75/5

Visitors Are Also Reading