Home » హీరో నాగచైతన్య దగ్గర ఖరీదైన బైకులు, కార్లు .. వాటి ధర ఎంత అంటే ?

హీరో నాగచైతన్య దగ్గర ఖరీదైన బైకులు, కార్లు .. వాటి ధర ఎంత అంటే ?

by Bunty
Ad

టాలీవుడ్ యంగ్ హీరోల్లో నాగచైతన్య కూడా ఒకరు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు నాగచైతన్య. నాగచైతన్యకు సినిమాలతో పాటు కార్లు అంటే కూడా చాలా ఇష్టం. ఆయన దగ్గర ఎన్నో అద్భుతమైన లగ్జరీ కార్లు, బైకులు ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే కార్లు కూడా చైతన్య దగ్గర ఉండడం విశేషం. కొన్ని కార్లు, బైకులను తన కుటుంబసభ్యులు గిఫ్టులుగా ఇచ్చేవారు.

Advertisement

సమంత కూడా వారిద్దరు విడిపోకముందు కొన్ని రకాల బైక్ లను, కార్లను గిఫ్ట్ గా ఇచ్చింది. కొన్ని కార్లు మాత్రం తన సొంతంగా కొనుక్కునేవాడు చైతన్య. అయితే…చైతన్య దగ్గర ఉన్న కార్ల వివరాలను ఇప్పుడు చూద్దాం…చైతన్య దగ్గర ఫెరారీ కంపెనీకి చెందిన 488జిటిబి అనే కారు ఉంది. దీని ధర 3.88 కోట్లు. చైతన్య దగ్గర ఉన్న కాస్ట్లీ కార్లలో ఇదే మొదటిది. బీఎండబ్ల్యూ 740 ఎల్ ఐ అని కారు కూడా చైతు దగ్గర ఉంది. దీని ధర రూ. 1.30 కోట్లు.

Advertisement

నిస్సాన్ జిటిఆర్ కారు ధర రూ. 2.12 కోట్లు. ల్యాండ్ రోవర్ కు చెందిన రేంజ్ రోవర్ వోగ్ కారు కూడా ఉంది. దీని ధర రూ.1.18 కోట్లు. మెర్సిడెస్ బెంజ్ జి క్లాస్ జి 63 ఏఎంజి కారు కూడా చైతన్య వాడుతున్నారు. దీని ఖరీదు రూ. 2.28 కోట్లు. ఎంవి ఆగస్టా ఎఫ్ 4 అనే బైకు కూడా చైతన్య దగ్గర ఉంది. దీని ధర రూ.35 లక్షలు. బీఎండబ్ల్యూ 9ఆర్ టి అనే బైక్ ధర రూ. 18.50 లక్షలు. ఈ కార్లు చైతు దగ్గర ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

Kailasa PM Ranjitha : నిత్యానంద రాజ్యానికి ప్రధానిగా నటి రంజిత!

Mohammed Shami : షమీ అరెస్ట్ తప్పదా? కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీం కోర్టు

2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..

Visitors Are Also Reading