తెలుగు ఇండస్ట్రీలో అలనాటి నటులలో సూపర్ స్టార్ గా పేరుపొందిన కృష్ణ లక్షలాది మంది అభిమాలను సంపాదించుకున్నారు. అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడిగా కృష్ణ ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలుగు తెరపై యాక్షన్ సినిమాల్లో డిఫరెంట్ స్టైల్లో కనిపించింది హీరో కృష్ణ మాత్రమే.. ఈయన సినిమా వచ్చింది అంటే ఏదో ఒక కొత్తదనం ఉండేదట. అప్పట్లో కృష్ణ సినిమాల్లో ఎక్కువగా గుర్రం చేజింగ్స్ ఉండేవి. గుర్రంపై కొన్ని పాటలు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే అనేక గ్రాఫిక్ సంస్థలు వచ్చి గుర్రంపై ఎక్కకున్నా ఎక్కినట్లు చూపిస్తున్నారు. కానీ అప్పట్లో గుర్రపు సీన్లు చేయాలంటే తప్పనిసరిగా హీరో గుర్రం ఎక్కి సవారీ చేయాల్సిందే.
Advertisement
Advertisement
గుర్రం ఎక్కడం అనేది మామూలు విషయం కాదు. అది ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తుందో మనకు తెలియదు. పైగా షూటింగ్ సమయం. హడావిడి ఎక్కువ ఉంటే అది బెదిరిపోతుంది. ఇప్పటి మాదిరిగా అప్పట్లో ఎలాంటి జాగ్రత్తలు ఉండేవి కావు. గుర్రపు సీన్లు చేయాలంటే కేవలం గుర్రం ఎక్కి సవారీ చేసే అలవాటు హీరోలకు ఉండాలి. లేదంటే ఆ గుర్రం చెప్పిన మాటలు వినేదై ఉండాలి. అయితే అప్పట్లో ఏదైనా గుర్రం సీన్లు చేయాలంటే గుర్రం వారికి అలవాటు పడితే దాదాపు ఆ గుర్రాన్ని ఆ హీరోకి మాత్రమే వాడేవారట.
ఈ విధంగా ఒక గుర్రం కృష్ణకు చాలా చనువైందట.. అప్పట్లో పులి గోవింద అనే వ్యక్తి సినిమాలో షూటింగ్లకు గుర్రాలను సప్లై చేసేవారు. అతని దగ్గర ఉన్న లక్ష్మీ అనే గుర్రాన్ని మాత్రమే కృష్ణ సినిమాల్లో వాడేవారట. ఒకవేళ వేరే హీరో సినిమా షూటింగ్ కు ఈ గుర్రం ఇవ్వాల్సి వస్తే కృష్ణ గారిని అడిగి ఓకే చెబితేనే ఇచ్చేవారని తెలుస్తోంది. అప్పట్లో ఈ గుర్రాన్ని కృష్ణ గారి గుర్రం అని పిలిచేవారని సమాచారం.
also read:ఎర్రగా ఉంటే హీరో అవుతారా అంటూ కృష్ణకు అవమానం.. దీంతో కృష్ణ ఎమోషనల్ అవుతూ ఏమన్నారంటే..?