Home » ఎర్రగా ఉంటే హీరో అవుతారా అంటూ కృష్ణకు అవమానం.. దీంతో కృష్ణ ఎమోషనల్ అవుతూ ఏమన్నారంటే..?

ఎర్రగా ఉంటే హీరో అవుతారా అంటూ కృష్ణకు అవమానం.. దీంతో కృష్ణ ఎమోషనల్ అవుతూ ఏమన్నారంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

హీరో కృష్ణ నుంచి మహేష్ బాబు వరకు ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేని హీరోలుగా కొనసాగారు.. మహేష్ బాబు ఇప్పటికి కొనసాగుతున్నారు కూడా.. అలాంటి ఘట్టమనేని ఫ్యామిలీలో హీరో కృష్ణ సూపర్ స్టార్ గా ఎదగడానికి అనేక అవమానాలు భరించారట.. అలాంటి సూపర్ స్టార్ కృష్ణ ను ఒకానొక సందర్భంలో చాలా అవమానించారట.. అవమానాన్ని భరించలేని కృష్ణ ఒక పార్టీలో కృష్ణంరాజుకు చెప్పుకుంటూ చాలా ఎమోషనల్ కూడా అయ్యారట.. మరి ఆ విషయాలు ఏంటో చూద్దాం.. కృష్ణ గారి సినీ ప్రస్థానంలో ఎప్పుడు కూడా కోపంగా మాట్లాడింది లేదని ఆయనతో తిరిగిన సన్నిహితులు చెబుతూ ఉంటారు. కానీ ఒక సందర్భంలో కృష్ణ కి పట్టరాని కోపం వచ్చిందట..

Advertisement

నన్ను అంతలా అవమానిస్తారా నేనేంటో నిరూపించుకుని చూపిస్తా అంటూ శపథం కూడా చేశారని దివంగత నటుడు కృష్ణంరాజు ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. మరి ఆ వివరాలు ఏంటో పూర్తిగా చూద్దాం.. చెన్నైలో సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న రోజులవి.. ఆ టైంలోనే తేనె మనసులు సినిమా కోసం ఆడిషన్లు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ ఆడిషన్స్ కి కృష్ణతో పాటుగా హేమమాలిని, కృష్ణంరాజు, సంధ్యారాణి,జయలలిత తదితరులు వెళ్లారట. చివరికి ఈ చిత్రానికి హీరోగా కృష్ణ, హీరోయిన్ గా సంధ్యారాణి సెలెక్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే పేపర్లో పెద్ద ప్రకటన కూడా వచ్చింది. దీంతో కృష్ణంరాజు టీ నగర్ లో ఒక చిన్న పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి వచ్చిన కృష్ణ ఎమోషనల్ అయ్యారట. తన మనసులోని బాధను కృష్ణంరాజుతో చెప్పుకున్నారట.

Advertisement

అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఎర్రగా ఉంటే హీరో అయిపోతారా..నీ వాయిస్ కి, హీరో క్యారెక్టర్ కి ఎలా సెట్ అవుతుంది అంటూ కొంతమంది అవమానించినట్లు కృష్ణ, కృష్ణంరాజుతో చెప్పుకొని ఎమోషనల్ అయ్యారట.. ఆ తర్వాత కోపంతో కృష్ణ నన్ను అవమానించిన వారికి నేనేంటో చూపిస్తా అని శపథం కూడా చేశారని కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూ లో గుర్తు చేసుకున్నారు. అప్పటికే తేనె మనసులు మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు. అయినా కృష్ణ ఈ విధంగా మాట్లాడడంతో ఆయన తెగువకు అందరూ ఆశ్చర్యపోయారని కృష్ణంరాజు చెప్పుకొచ్చారు.

also raed:మహేష్ బాబు కుటుంబంలో వరుస మరణాలకు కారణం ఆ శాపమేనా..?

Visitors Are Also Reading