Telugu News » Blog » హీరో బాలయ్య భయపడేది ఆవిడకు మాత్రమే..ఆమె శాసించిందంటే చేయాల్సిందే మరీ..!!

హీరో బాలయ్య భయపడేది ఆవిడకు మాత్రమే..ఆమె శాసించిందంటే చేయాల్సిందే మరీ..!!

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ads

ఇండస్ట్రీలోని నందమూరి ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు ఉంటాయి.. ఒకప్పుడు నందమూరి ఫ్యామిలీ హీరో అంటే నట సార్వభౌమ ఎన్టీఆర్ గారు గుర్తొచ్చేవారు.. ఆయన నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆయన కొడుకు నందమూరి బాలకృష్ణ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ మాస్ హీరోగా ఎంతో పేరు సంపాదించుకున్నారు.

Advertisement

ఇండస్ట్రీలో బాలయ్య సినిమాలు అన్నా,ఆయన ఫ్యాన్స్ అంటే వేరే లెవెల్ ఉంటారు. సినిమాల గురించి పక్కన పెడితే ఆయన కుటుంబంలో ఆయన కూతురైన బ్రాహ్మణి మాత్రమే చాలా మందికి తెలుసు.

also read:ఆ సినిమా వ‌ల్ల ఎన్టీఆర్ మూడు నెల‌ల పాటూ ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారా..? అస‌లేం జ‌రిగింది..?

Advertisement

ఎందుకంటే నారా లోకేష్ ను వివాహం చేసుకొని బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటుంది కాబట్టి. కానీ బాలయ్య చిన్న కూతురు తేజస్విని అంతగా ఎవరికీ పరిచయం లేదు.. ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే బాలకృష్ణ భయపడేది ఈమెకు మాత్రమేనట.. తన చిన్న కూతురు అంటే ఆయనకు అంత ప్రేమ. అలాగే ఆమె ఏది చెప్తే అది తప్పనిసరిగా బాలయ్య వింటారట.. ఈమె బాలయ్య సినిమాలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటూ ఉంటుంది. బాలకృష్ణ సినిమా డేట్స్, ఇతర ప్రోగ్రామ్స్ ఏవైనా సరే తన చిన్న కూతురు చూసుకుంటుందని తెలుస్తోంది.

ఆయన రోజు ఏ డ్రెస్ వేసుకోవాలి అనేది కూడా ఆమె నిర్ణయం తీసుకుంటుందట. ఇది వరకు బాలయ్య సంబంధించిన ఆర్థిక లావాదేవీలు అన్ని ఆయన సతీమణి చూసుకునేవారు. కానీ తేజస్విని ఇప్పుడు ఆ బాధ్యత తీసుకుందట. అయితే ఈమె గీతం యూనివర్సిటీ యజమాని మూర్తి మనవడు శ్రీభరత్ వివాహం చేసుకుంది.. ప్రస్తుతం ఈమె తన కుటుంబ సభ్యులతో కలిసి బాలయ్య సినిమా వ్యవహారాలు చూసుకుంటూ హైదరాబాదులోనే ఉంటుందట. త్వరలోనే నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెడతారు అనే టాక్ వినిపిస్తోంది.

Advertisement

also read:

You may also like