Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » భార్య గర్భవతిగా ఉన్నప్పుడు గృహ నిర్మాణం చేయరాదు.. ఎందుకో తెలుసా..?

భార్య గర్భవతిగా ఉన్నప్పుడు గృహ నిర్మాణం చేయరాదు.. ఎందుకో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

మన భారతదేశ సంప్రదాయం ప్రకారం మనం ఏ పనిని మొదలు పెట్టాలన్న వాస్తు, మంచి సమయం ముహూర్తం చూసి ప్రారంభిస్తాం.. దీన్ని బట్టి చూస్తే ఇంట్లో భార్య గర్భంతో ఉన్నప్పుడు గృహ నిర్మాణం చేయరాదని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.. ఎందుకు చేయరాదో పూర్తి వివరాలు చూద్దాం.. భార్య గర్భంతో ఉన్న సమయంలో యజమాని మరో గర్భాన్ని నిర్మించరాదు.. మరో గర్భం అంటే నూతన నిర్మాణం.. వాస్తు శాస్త్రం ప్రకారం చూస్తే యజమాని భార్య కానీ కోడలు కానీ గర్భందాల్చిన తర్వాత కొత్త గృహ నిర్మాణం కాకుండా గృహానికి సంబంధించిన ఎలాంటి పనులు కూడా చేయరాదు.

Advertisement

Ad

also read:ఈ ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు వంకాయ అస్స‌లు తినొద్దు..!

అంటే ప్రహరీ గోడ జరపడం గాని, ఇతర రంగులు వేయడం గానీ, ఇంటికి సంబంధించిన ఎలాంటి పనులు కూడా చేయకూడదనీ వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.. మరీ ముఖ్యంగా గర్భస్థ స్త్రీ ఐదు నెలలు దాటి ఉన్నట్లయితే ఇక ఈ పనులను అస్సలు ముట్టు కోకపోవడమే మంచిదని వారు అంటున్నారు. అయితే కొంతమందికి ఈ అపోహ ఉండవచ్చు.. ఒకవేళ యజమాని కూతురు గర్భంతో ఉంటే గృహ నిర్మాణ పనులు చేయవచ్చా అంటే.. చాలా బేషుగ్గా చేసుకోవచ్చని వారంటున్నారు. దీనికి కారణం ఏంటంటే కూతురు వేరే వారి ఇంటికి కోడలిగా వెళ్ళింది.. ఆమె ఇంటి పేరు మారిపోయింది. కాబట్టి ఆమెతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు..

ఒకవేళ ఇంటి యజమాని కోడలు లేదా భార్య ఆ పరిస్థితుల్లో ఉంటే నిర్మాణం చేపట్టినట్టయితే అది ముందుగా గర్భవతి పై ఎఫెక్ట్ చూపించి ఆ తర్వాత యజమానిపై ఎఫెక్ట్ చూపిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. మరో విధంగా చెప్పాలంటే భార్య గర్భంతో ఉన్నప్పుడు ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.. ఈ సమయంలోనే గృహ నిర్మాణాన్ని మొదలు పెడితే నిర్మాణం పై కూడా శ్రద్ధ పెట్టాలి.. ఒకే సమయంలో రెండు పనులపై దృష్టి పెట్టలేదు కాబట్టి భార్య గర్భంతో ఉన్నప్పుడు గృహ నిర్మాణం చేయకపోవడమే మంచిదని కొంతమంది నిపుణులు అంటున్నారు..

Advertisement

also read:

Visitors Are Also Reading