సాయి కుమార్ కుమారుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో ఆది. ప్రేమ కావలి సినిమాతో ఆది సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా తర్వాత ఆదికి మళ్లీ ఆ రేంజ్ లో హిట్ పడలేదనే చెప్పాలి. ఇప్పటివరకు ఆది క్లాస్… మాస్ అన్ని రకాల సినిమాలు ట్రై చేశాడు. కానీ సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయాడు.
Advertisement
అయితే సినిమా లైఫ్ సో సోగా ఉన్నప్పటికీ ఆది రియల్ లైఫ్ లో చాలా సంతోషంగా ఉన్నాడు. తాజాగా ఆది.. వెన్నెల కిషోర్ హోస్ట్ చేస్తున్న అలా మొదలైంది షోలో తన భార్య అరుణ తో కలిసి సందడి చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయింది. ఈ షో లో ఆది ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన సోదరి వివాహంలో చాలా ఎంజాయ్ చేశానని చెప్పారు. ఆ పెళ్లికి అరుణ కూడా వచ్చిందన్నాడు.
Advertisement
మొదటిసారి అప్పుడే ఆమెను చూసానని అన్నాడు. అదేవిధంగా తన మామయ్య ఆమెను పరిచయం చేశాడని చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకు తన బావ ఫోన్ చేసి అరుణ వాళ్లు పెళ్లి ప్రపోజల్ పెట్టారని చెప్పాడు. దాంతో నాకు టైం కావాలని చెప్పానని అన్నాడు. ఇంటికి వెళ్ళాక ఫోటోలు చూశానని… మా అమ్మ వాళ్లు నా పెళ్లి గురించి చర్చించుకుంటే నేను మా చెల్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ వినే వాళ్ళమని అన్నాడు.
ఇక ఆది ఫోటోలను తాను గూగుల్ చేసి చూశానని అరుణ చెప్పారు. పెళ్లి కుదిరిన తర్వాత మా నాన్న దగ్గరికి వెళ్లి సినిమా వాళ్ళు కదా పర్వాలేదా..? అని అడిగానని అన్నారు. తమ పెళ్లి చూపులు ఎయిర్ పోర్ట్ లో జరిగాయని అరుణ చెప్పారు. అనుకోకుండా ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్నామని అక్కడే నంబర్ తీసుకున్నాడని తెలిపారు. ఇక పెళ్లి తర్వాత మొదటిసారి హనీమూన్ లో గొడవ జరిగిందని అన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ మొదటిసారి అక్కడే గొడవ జరిగిందని చెప్పారు. ఓ గంట తర్వాత మళ్లీ నార్మల్ అయ్యామని చెప్పారు. ప్రస్తుతం తాము చాలా సంతోషంగా ఉన్నామని ఆది అరుణ తెలిపారు.
ALSO READ:రజనీకాంత్ వాఖ్యాలతో NTR ఆత్మ ఘోషిస్తోంది – రోజా