నటి,బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన కరాటే కళ్యాణి గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈమె పేరు మూడు రోజుల నుండి అందరి నోళ్లలో మెదులుతోంది. యూట్యూబర్ శ్రీకాంత్ ఇంటికి వెళ్లి అతని తో గొడవ పెట్టుకొని ఘర్షణకు దిగి అతనిపై చేయి చేసుకోని నానా హంగామా చేయడం వల్ల కరాటే కళ్యాణి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ గొడవ తర్వాత చాలామంది కరాటే కళ్యాణి మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అయితే మరోపక్క కరాటే కళ్యాణి గారు ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించడం తీవ్ర కలకలం రేపింది. ఆమె దగ్గర ఉంటున్న చిన్నారి ఎవరు అనే విషయాలు తెలుసుకోవడానికి అక్కడికి చైల్డ్ వెల్ఫేర్ అధికారులు వెళ్లారు. ఆమె ఆ చిన్నారిని అక్రమంగా కొనుగోలు చేసిందని వారికి సమాచారం అందడంతో కళ్యాణి ఇంటికి వెళ్లి వారు సోదాలు నిర్వహించారు. అయితే వారు వెళ్ళిన సమయంలో కరాటే కళ్యాణి ఇంట్లో లేదు.దాంతో ఇంట్లో అన్నీ పరిశీలించి వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే ఆ చిన్నారిని అక్రమంగా తీసుకు వచ్చుకుందా లేదా దత్తత తీసుకోవాలని చూస్తుందా అనే విషయంపై ఆరా తీశారు. అయితే ఈ విషయం మీద కరాటే కళ్యాణి తల్లిగారు స్పందిస్తూ మేం ఏ తప్పు చేయలేదని, చట్ట ప్రకారమే ఆ చిన్నారిని దత్తత తీసుకున్నామని ఆమె తెలిపారు. ఆ చిన్నారి మాత్రమే కాకుండా ఇంకో పన్నెండేళ్ల అబ్బాయిని కూడా మా కూతురు పెంచుకుంటుందని విజయలక్ష్మి చెప్పుకొచ్చింది.
Advertisement
Advertisement
ఆ చిన్నారి డిసెంబర్ 25న పుట్టిందని, 28న ఆ చిన్నారిని మా కూతురు ఇంటికి తీసుకు వచ్చిందని ఆ పాప పేరు మౌక్తిక అని స్పష్టం చేసింది. అలాగే అబ్బాయిని శ్రీకాకుళం నుంచి తీసుకువచ్చుకున్నామని తెలిపింది. కానీ కరాటే కళ్యాణి ఆ పాపను అక్రమంగా తీసుకచ్చుకుందని చైల్డ్ వెల్ఫేర్ అధికారి మహేష్ తెలిపారు. అయితే వాళ్ళ ఇంట్లో చట్టప్రకారమే దత్తత తీసుకున్నామని తెలపడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. 1098 ఫోన్ కాల్ ద్వారా వచ్చిన సమాచారంతో హైదరాబాదులోని ఎస్ ఆర్ నగర్ లో నివాసం ఉంటున్న కరాటే కళ్యాణి ఇంటికి సోదాలకు వచ్చామని తెలియజేశాడు. మేము వెళ్ళిన సమయంలో కరాటే కళ్యాణి ఇంట్లో లేకపోవడంతో ఆమె తల్లిని,తమ్ముడిని ప్రశ్నించామని,కానీ మా ప్రశ్నలకు వాళ్లు సరైన సమాధానాలు చెప్పలేదని స్పష్టం చేశారు.
ALSO READ;
చిరంజీవి ఇంట్లో….బాలకృష్ణ సినిమా షూటింగ్!
ఒక్క క్షణం ఆలస్యమైనా ఏమి జరిగేదో తెలుసా..?