తెలుగులో “అందాలొలికే సుందరి రాత్రికి కలలోకి వచ్చేనే”అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ పాట ప్రేమ సాగరం సినిమాలోని డబ్బింగ్ పాటే అయినప్పటికీ చాలా మందికి ఆ పాట ఇప్పటికి కూడా ఇష్టమే. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. సంఘర్షణ సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్ గా కూడా నటించింది. ఆమె నళిని. ఈమె అసలు పేరు రాణి. ఈమె తండ్రి వై. కే.మూర్తి సినిమాల్లో కొరియోగ్రాఫర్. ఆమె స్కూలుకు వెళ్లే సమయంలో ఇలవేళ అనే సినిమాలో నటించి స్టేట్ అవార్డును కూడా అందుకుంది.
Advertisement
ఆ తర్వాత టి.రాజేంద్ర దర్శకత్వంలో ప్రేమ సాగరం సినిమాలో నటించింది. ఆ సినిమాతో ఆమెకు మరింత గుర్తింపు లభించింది. పలు భాషల్లో మంచి మంచి సినిమాల్లో నటించింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. పెళ్లి చేసుకున్నాక చాలా రోజుల విరామం తర్వాత ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది. అప్పటి నుండి కొన్ని నెగటివ్ పాత్రల్లో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ వచ్చింది. సినిమాలే కాకుండా బుల్లితెర మీద సీరియల్స్ లో కమెడియన్ పాత్రల్లో నటిస్తూ అందరినీ అలరిస్తుంది. ఆమె భర్త రామరాజన్.మంచి పేరున్న దర్శకుడు. అప్పట్లో ఆయన తీసిన ఒక సినిమా రెండు సంవత్సరాలకు పైగా థియేటర్లలో ఆడింది.
Advertisement
అతను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు మీ అమ్మాయిని ప్రేమిస్తున్నా అని నళిని తల్లితో రామరాజన్ చెప్పడంతో ఆయనను రక్తం వచ్చేలా కొడుతుంది నళిని తల్లి. ఆ తర్వాత నళిని ని తమిళ పరిశ్రమకు దూరం చేసి మలయాళ పరిశ్రమ కి తీసుకెళ్ళింది.ఆ తర్వాత తెలుగులో జీవిత తో కలిసి సినిమా చేస్తున్నప్పుడు తన ప్రేమ విషయం చెప్పి నళిని చాలా బాధపడిందట. దాంతో జీవిత వాళ్ళిద్దరి పెళ్లికి సహాయం చేస్తుంది. వారికి పెళ్ళై ఇద్దరు కవల పిల్లలు కూడా పుడతారు. జాతకాలను ఎక్కువగా నమ్మే రామరాజన్ పిల్లలను హాస్టల్లో ఉంచుదాం అన్న సందర్భంలో వారి మధ్య విభేదాలు వచ్చి కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. కానీ వారి పిల్లలకు పెళ్లి చేయాల్సిన సమయంలో కొద్ది రోజులు వాళ్ళు కలిసే ఉన్నారు.
also read;