Home » ఆ స్టార్ హీరోయిన్ తో మ‌ర‌ళీ మోహ‌న్ ప్రేమ‌, పెళ్లి అంటూ ఎందుకు వార్త‌లు వ‌చ్చాయి..?

ఆ స్టార్ హీరోయిన్ తో మ‌ర‌ళీ మోహ‌న్ ప్రేమ‌, పెళ్లి అంటూ ఎందుకు వార్త‌లు వ‌చ్చాయి..?

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రెండు సినిమాలకు మించి ఒక హీరోయిన్ తో వరుసపెట్టి సినిమాలు చేస్తే గాసిప్ట్స్ రావడం పక్కా. హీరో హీరోయిన్ల మధ్య ఏం లేకపోయినా రకరకాల వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టడం ప్రారంభమవుతుంది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ రష్మిక మధ్య కూడా అలాంటి వార్తలే చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇలా జరగడం ఈ జనరేషన్ లోనే కాదు ఎప్పటినుండో ఇండస్ట్రీలో ఇది కామన్ అయిపోయింది. అలాంటి వార్తలతో ఇబ్బంది పడ్డ వారిలో ఒకప్పటి హీరో మురళీమోహన్ కూడా ఒకరు. మురళీమోహన్ ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అయితే మురళీమోహన్ ఒకానొక స్టేజ్ లో ఎక్కువగా హీరోయిన్ జయచిత్ర తో సినిమాలు చేశారు. దాంతో ఓ తమిళ పత్రిక మురళీ మోహన్ జైచిత్ర వివాహం చేసుకోబోతున్నారంటూ కథనాన్ని ప్రచురించింది. ఆ వార్తలతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షేక్ అయింది. అయితే మొదటి రోజు ఆ వార్త వచ్చిన తర్వాత మురళీమోహన్ కు వెంటనే తెలియలేదు. మురళీమోహన్ షూటింగ్ కోసం వారాహి స్టూడియోకు వెళ్లగా అక్కడ ఆయనతో కలిసి నటించిన హీరోయిన్ దగ్గరకు వెళ్లి మీరు జ‌య‌చిత్ర‌ను పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ నిలదీసిందట‌.

Advertisement

అంతే కాకుండా అక్కడ ఉన్న వాళ్లంతా మురళీమోహన్ ను వింతగా చూశారట. దాంతో మురళీమోహన్ ఒక్కసారిగా ఖంగు తిన్నారట. మీకు ఎవరు చెప్పారని ఆ హీరోయిన్ ను ప్రశ్నించగా పేపర్ లో వార్త‌ వచ్చిందని సమాధానమిచ్చార‌ట. అంతేకాకుండా మురళీమోహన్ తో మొదటి సినిమా తీసిన నిర్మాత కూడా ఫోన్ చేసి మీపై నాకు నమ్మకం ఉంది…. కానీ అలాంటి ఉద్దేశ్యం ఉంటే మానుకోవాలని చెప్పారట.

దాంతో మురళీమోహన్ ఈ వార్త తన భార్యకు కూడా తెలిసిందేమో అని కంగారుపడి వెంటనే ఫోన్ చేశారట. కానీ మురళీమోహన్ భార్య మాత్రం నీ గురించి నాకు తెలియదా….? అంటూ సమాధానం ఇవ్వడంతో కూల్ అయ్యారట. కానీ మురళి మోహన్ పిల్లలు స్కూల్ వెళ్లగా వారి స్నేహితులు సైతం మీ నాన్న హీరోయిన్ జయచిత్ర ను పెళ్లి చేసుకుంటున్నారా అంటూ ప్రశ్నలు వేయడం బాధించిందని మురళీమోహన్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

Visitors Are Also Reading