Home » మహేష్ బాబు గురించి సుదీర్ బాబు మాటలు వింటే ఆశ్చర్య పోవడం పక్కా..!

మహేష్ బాబు గురించి సుదీర్ బాబు మాటలు వింటే ఆశ్చర్య పోవడం పక్కా..!

by Anji
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబుతో కొట్టించుకోవడం ఆ హీరోకి ఏమాత్రం ఇష్టం లేదట. ఇంతకీ ఎవరా హీరో ఏంటి..? అసలు మ్యాటర్ అనుకుంటున్నారా..?  సుధీర్ బాబు హీరోగా.. ప్రముఖ యాక్టర్ హర్షవర్ధన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మామ మశ్చీంద్ర. ఈ సినిమాలో మొదటి హీరో సుధీర్ బాబు ట్రిపుల్ యాక్షన్ చేస్తున్నాడు. మూడు విభిన్న పాత్రలలో ఆయన కనిపించబోతున్నాడు. సుదీర్ బాబుకు జోడిగా ఇషా రెబ్బ, మృణాళిని రవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

 


చాలా రోజుల క్రిందటే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ అవ్వడానికి రెడీ అయింది. ఇక నిన్న సాయంత్రం ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఇక ఈ సినిమా ప్రెస్ మీట్ లో హీరో సుధీర్ బాబు మహేష్ బాబు గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో మొదటగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన సుదీర్ బాబు ఆ తరువాత నుంచి హీరోగా చేస్తూ వస్తున్నాడు. అయితే ఆయన ఎంచుకున్న కథలు దృష్ట్యా సుధీర్ బాబు కెరీర్ ఆశించినంత సక్సెస్ ఫుల్ గా లేదనే చెప్పాలి.

Advertisement

Advertisement

తెలుగులో హీరోగా చేస్తూనే ఆ మధ్య సుదీర్ బాబు బాలీవుడ్ లో వర్షం రీమేక్ గా వచ్చిన భాగి అనే సినిమాలో విలన్ గా కూడా నటించారు. ఇక మామ మశ్చీంద్ర సినిమాలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ విషయంపై మీడియా ప్రతినిధి మహేష్ బాబు సినిమాలో విలన్ గా చేయవలసి వస్తే చేస్తారా అని ఆయనను అడగగా సుధీర్ బాబు రిప్లై ఇచ్చాడు. స్క్రీన్ పైన అయిన రియల్ లైఫ్ లో అయిన మహేష్ ను హేట్ చేయడం తన వల్ల కాదని, అలాగే మహేష్ చేతిలో తన్నులు తినడం కూడా తాను చేయలేనని చెప్పాడు. అయితే సుధీర్ ఈ విధంగా చెబుతూనే ఒకవేళ చేయవలసి వస్తే చేస్తాను కానీ అది తన మనసుకు నచ్చదు అని చెప్పుకొచ్చాడు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 భారతీయుడు సినిమాని తెలుగు లో ఆ హీరోతో రీమేక్ చేయాలని అనుకున్నారా..? 

 నాగ చైతన్య సినిమా కి సాయి పల్లవి రెమ్యూనరేషన్ అంత తీసుకుంటుందా..?

Visitors Are Also Reading