Home » ద్రాక్ష పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇన్ని ఉన్నాయా..?

ద్రాక్ష పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇన్ని ఉన్నాయా..?

Ad

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుత కాలంలో ఎలాంటి ఫుడ్ తీసుకున్న దానిలో మనకు హాని చేసే రసాయనాలు కొంతవరకైనా ఉంటున్నాయి. అలాంటి తరుణంలో ద్రాక్ష పండ్లను తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందట.. అయితే చాలామంది ద్రాక్ష పండ్లను ఇష్టపడరు. ఎందుకంటే పుల్లగా తీయగా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. అలాంటి ద్రాక్ష వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం.. ద్రాక్షలో విటమిన్ ఏ, విటమిన్ సి, బి తో పాటుగా పొటాషియం, క్యాల్షియంలు ఉన్నాయి.

also read:Mahesh Babu : దుబాయ్ లో కోట్లు పెట్టి… విల్లా కొన్న మహేష్ బాబు!

Advertisement

అలాగే ఫ్లవనాయిడ్స్ కూడా ద్రాక్షలో ఎక్కువగా లభిస్తాయి. అంటే శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్లు ద్రాక్షలో ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. అంతేకాకుండా ద్రాక్షలో తగిన మోతాదులో ఉండే మెగ్నీషియం, గ్లూకోస్, ఫైబర్, సిట్రిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అలాగే అస్తమాను తగ్గించే గుణం ద్రాక్షలో ఉంది. అస్తమాతో బాధపడే వారు ప్రతి రోజు కొన్ని ద్రాక్ష పళ్ళను తింటే క్రమేపి దాని తీవ్రత నుండి బయటపడవచ్చు. రక్తంలో నైట్రిక్ స్థాయిలను పెంచి రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది.

Advertisement

also read:ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనుకోలేదు.. గోపీచంద్ ఆసక్తికర కామెంట్స్..!

తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ద్రాక్ష పళ్ళను నేరుగా తిన్న లేదా జ్యూస్ రూపంలో తీసుకున్న ఫలితం అనేది ఉంటుంది. తీవ్రమైన మైగ్రేన్ నొప్పితో బాధపడేవారు ఉదయాన్నే పరిగడుపున నీళ్లు చక్కెర కలపకుండా ద్రాక్ష రసాన్ని తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందట.ప్రతిరోజు కనీసం 15 నుంచి 20 ద్రాక్ష పళ్ళు తీసుకుంటే కంటి చూపు మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

also read:సూపర్ స్టార్ కృష్ణ శ్రీరాముడి పాత్రలో నటించిన సినిమా ఏదో తెలుసా?

Visitors Are Also Reading