Home » నాగార్జున మ‌న్మ‌థుడు హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా..?

నాగార్జున మ‌న్మ‌థుడు హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా..?

by Anji
Ad

అక్కినేని నాగార్జున కెరీర్‌లో ది బెస్ట్ మూవీ ఏదైనా ఉన్న‌ద‌ని అంటే అది మ‌న్మ‌థుడు అని చెప్పుకోవ‌చ్చు. ఈ సినిమా అమెరికాలో ఏకంగా 50 రోజులు ఆడింద‌ని చాలా మందికి తెలియ‌దు. క‌థ విష‌యానికొస్తే.. సింపుల్ ల‌వ్ స్టోరీ అయినా.. కామెడీ మాత్రం అదిరిపోతుంది. దానికి తోడు నాగార్జున‌, బ్ర‌హ్మానందం మ‌ధ్య‌లో సాగే పంచ్ డైలాగ్‌లు పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్వు తెప్పిస్తుంది. ఈ సినిమాలో నాగ్ ఇద్ద‌రు హీరోయిన్ల‌తో రొమాన్స్ చేశాడు. ఒక‌రు సోనాలి బింద్రే కాగా.. మ‌రొక హీరోయిన్ అన్షు. ఈ అమ్మాయి ప్ర‌భాస్‌తో రాఘ‌వేంద్ర సినిమాలో కూడా క‌నిపించింది. ఆ త‌రువాత మ‌ళ్లీ వెండి తెర‌పై పెద్ద‌గా క‌నిపించ‌లేదు.

Nagarjuna : నాగార్జున మన్మధుడు హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందంటే..? | The  Telugu News

Advertisement

అన్షు తెలుగులో చేసింది త‌క్కువ సినిమాలే అయినా మంచి పాత్ర‌ల‌లో న‌టించి అంద‌రినీ మెప్పించిన‌ది. అన్షు పేరుతో ఎవ‌రు గుర్తు ప‌ట్ట‌క‌పోయినా ఆమెను చూస్తే చాలు మ‌న్మ‌థుడు హీరోయిన్ అని అంద‌రూ గుర్తుకు పెట్టుకుంటారు. అందులో ఆమె క్యారెక్ట‌ర్ అలాంటిది. ఆ సినిమా న‌టీన‌టుల‌కే కాదు. చిత్ర యూనిట్ మొత్తానికి మంచి పేరు తీసుకొచ్చిన‌ది. ఇక మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఈ చిత్రానికి డైలాగులు రాసాడు. కే.విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 2002లో విడుద‌ల అయిన తెలుగు చిత్రం క‌న్న‌డంలో ఉపేంద్ర ప్ర‌ధాన పాత్ర‌లో ఐశ్వ‌ర్య‌గా రీమెక్ చేశారు.

Advertisement

Nagarjuna : నాగార్జున మన్మధుడు హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందంటే..? | The  Telugu News

ఇక మ‌న్మ‌థుడు సినిమాలో నాగార్జునతో క‌లిసి న‌టించిన అన్షు ఒక్క‌సారిగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి అదృశ్య‌మైంది. ప్ర‌శాంత్ న‌టించిన త‌మిళ చిత్రం జైలో ప‌ని చేసిన ఆమె.. చివ‌ర‌కు త‌న జ‌న్మ‌స్థ‌ల‌మైన లండ‌న్‌కు తిరిగి వెళ్లి అక్క‌డ విద్య‌న‌భ్య‌సించింది. ఆ త‌రువాత స‌చిన్ అనే వ్యాప‌ర‌వేత్త‌ను వివాహం చేసుకుని యూకేలో స్థిర‌ప‌డింది. ఈ దంప‌తుల‌కు ఒక కుమార్తె ఉంది. అన్షు ఇప్పుడు ఫ్యాష‌న్ డిజైన‌ర్‌గా ప‌ని చేస్తోంది. ఆమె త‌న సొంత డిజైన‌ర్ లేబుల్ ఇన్‌స్పిరేష‌న్ కోచ‌ర్‌ను కూడా క‌లిగి ఉంది. ఇక మున్మథుడు సినిమాలో అన్షు ఉత్త‌మ స‌హాయ న‌టిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్న విష‌యం తెలిసిందే..!

Visitors Are Also Reading