Home » ‘దేవర’ కొత్త పోస్టర్ లో ఈ ట్విస్ట్ గమనించారా..? స్టోరీ మొత్తం తెలిసిపోయిందిగా..!

‘దేవర’ కొత్త పోస్టర్ లో ఈ ట్విస్ట్ గమనించారా..? స్టోరీ మొత్తం తెలిసిపోయిందిగా..!

by Anji
Ad

టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. RRR వంటి సూపర్ హిట్ మూవీ తరువాత ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ మూవీలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా సరే దేవర పేరు మారు మ్రోగిపోతుందనే చెప్పాలి. ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపించేలా దేవర గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Advertisement

ఇందులో అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. అయితే వాస్తవానికి ఏప్రిల్ 05న దేవర సినిమాని విడుదల చేస్తామని గతంలోనే చిత్ర యూనిట్ ప్రకటించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. విజయదశమి కానుకగా అక్టోబర్ 10న ఈ సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ అఫీషియల్ గా ప్రకటించారు కూడా.

Advertisement

అయితే అక్టోబర్ 10న విడుదల అవుతుందని ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ కొత్త పోస్టర్ తో సినిమా సగం మ్యాటర్ లీక్ అయిపోయింది అంటూ ఆ పోస్టర్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు దేవర పోస్టర్స్ లో ఎన్టీఆర్ ఓల్డ్ లుక్స్ లోనే కనిపిస్తాడు. కానీ ఈ కొత్త పోస్టర్ లో మాత్రం యంగ్ లుక్స్ లో కనిపించాడు. అంతేకాదు.. వర అనే దానిని రెడ్ కలర్ లో చూపిస్తారు. అంటే ఇన్నాళ్లు మనం దేవర పోస్టర్ లో చూసిన దేవర తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు అని.. ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ లో ఉన్న ఎన్టీఆర్ కొడుకుగా వరా అనే పాత్రలో కనిపించబోతున్నాడని.. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని రచ్చ రంబోలా అని పొగిడేస్తున్నారు అభిమానులు. దేవర మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి మరీ.

Also Read :  ‘మురారి’ శాపం వెనుక దాగి ఉన్న స్టోరీ ఇదే.. క్లైమాక్స్ లో ఆ పాటను వద్దన్న కృష్ణ..!

Visitors Are Also Reading