అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన తాజా చిత్రం ది ఘోస్ట్. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా విడుదలై పర్వాలేదు అనిపించుకుంది. ఇందులో నాగార్జునకి జోడీగా సోనాల్ చౌహన్ నటించారు. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్వకత్వం వహించారు. ఇదిలా ఉండగా తాజాగా నాగార్జున పస్ట్ మ్యారేజ్ పిక్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నాగార్జున తొలుత లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించి ఓ ఫోటో వైరల్ అవుతోంది.
నాగార్జున- లక్ష్మికి పుట్టిన సంతానమే నాగచైతన్య. లక్ష్మీ విక్టరీ వెంకటేష్ చెల్లెలు. 1984లో నాగార్జున లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. 1990లో నాగార్జున, లక్ష్మి విడిపోయారు. 1992లో నాగార్జున హీరోయిన్ అమలను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ పుట్టిన సంతానమే అఖిల్. నాగార్జున సినిమాల విషయానికి వస్తే.. ఘోస్ట్ సినిమాలో నాగార్జునతో పాటు సోనాలీ చౌహన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, రవివర్మ తదితరులు నటించారు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ నారంగ్, సునిల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్‌లతో కలిసి ఈ ప్రాజెక్ట్ ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓటీటీ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లెక్స్ కైవసం చేసుకుంది. ఈ చిత్రం విడుదలైన 8 వారాల తరువాత ఓటీటీలోకి రానుంది.
Advertisement
Advertisement
Also Read : భార్యతో విడాకులకు రెడీ అవుతున్న బిచ్చగాడు హీరో..? కారణం అదేనా..?
గత ఏడాది వైల్డ్ డాగ్ సినిమాతో పలకరించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి సరైన వసూళ్లు దక్కలేదు. ఈ ఏడాది సంక్రాంతికి బంగార్రాజు సినిమాతో పలుకరించారు. ఈ చిత్రం సక్సెస్‌తో నాగార్జున బ్యాక్ బౌన్స్ అయ్యారనే చెప్పాలి. అదే ఊపుతోనే ఇప్పుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ సినిమా చేశారు. 1988లో ఇదే రోజున నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబోలో వచ్చిన శివ విడుదలై సంచలన విజయం సాధించింది. తాజాగా ది ఘోస్ట్ సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ భావించింది. కానీ అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది.