దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాలుగా విడుదలైన విషయం తెలిసిందే. తొలి భాగం బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2 ది కన్ క్లూషన్ అని రెండు భాగాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రికార్డులను సృష్టించాయి. ఇందులో ఓ చిన్న విషయం మాత్రం చాలా మంది గమనించలేదు. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Also Read : RRR : ఆ హీరోయిన్స్ ఆర్ఆర్ఆర్ రిజెక్ట్ చేయడానికి కారణం ఏమిటంటే..?
తొలి భాగం సినిమాలో మహేంద్ర బాహుబలి(శివుడు), అవంతిక ఓ ప్రదేశంలో సరదాగా గడుపుతారు. అక్కడ ఓ పాట కూడా ఉంటుంది. అయితే ఆ ప్రదేశంలో ఏమిటంటే.. దేవసేన రాజ్యం కుంతల. భల్లాల దేవుడు ఆ రాజ్యంపై దండెత్తి దానిని సర్వనాశనం చేస్తాడు. దీంతో ఆ రాజ్యంలో శిథిలాలు మాత్రమే మిగులుతాయి. అవంతిక, శివుడు అక్కడే ప్రేమాయణం కొనసాగిస్తారు. అవంతిక బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ శిథిలాలను స్ఫష్టంగా చూడవచ్చు.
Advertisement
ముఖ్యంగా కుంతల రాజ్యం తెల్లని రాయిపై నిర్మించి ఉంటుంది. వాటిని సులభంగా గుర్తు పట్టొచ్చు. బాహుబలి ద్వితీయ భాగంలో దేవసేన రాజ్యాన్ని క్లియర్‌గా చూడవచ్చు. ఆ రాజ్యం భల్లాల దేవుడి వల్ల నాశనం అయ్యాక శిథిలావస్థకు చేరుకుంటుంది. అయితే దానిని నాశనం చేయముందు.. చేసిన తరువాత స్పష్టంగా చూడవచ్చు. కానీ ఈ విషయాన్ని చాలా మంది ఇప్పటివరకు గమనించలేదు. ఈ రెండు ఫోటోలలో కూడా హంసలకు సంబంధించిన చిన్న విగ్రహాలుంటాయి. కుంతల రాజ్యానికి చిహ్నాలు. బాహుబలి ది బిగినింగ్‌లోనే మనకు కుంతల రాజ్యం అంతా స్పష్టంగా కనిపించడం విశేషం.
Also Read : జయం సినిమా సమయంలో సదాను తేజ కొడితే నితిన్ ఫైర్ అయ్యాడా..?