కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. మహా పురుషులవుతారు.. అనే సామెత ఊరికే రాలేదు.. దాని వెనుక ఎంతో అర్థం పరమార్థముంది. మనం కష్టపడి మొహమాటపడకుండా ఏ పని చేసిన అందులో సక్సెస్ అవుతానని ప్రముఖులు ఏనాడో చెప్పారు. ఏదైనా పని ఇష్టంతో కష్టపడుతూ వెళుతూ ఉంటే ఫలితం అనేది దానంతట అదే వస్తుంది. ఏదైనా సరే మనసుకు నచ్చలేదు అంటే ఎంత ఒత్తిడి చేసిన మనం ఆ పని చేయలేము.
Advertisement
ఇలాంటి కోవకు చెందిన వారు ఈ యువ ఇంజనీర్లు. హర్యానా రాష్ట్రానికి చెందిన సచిన్ బీటెక్ పూర్తి చేశాడు. అతని ఫ్రెండ్ రోహిత్ డిగ్రీ పూర్తి చేశాడు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉద్యోగాల్లో చేరారు. కొన్ని రోజులు జాబ్ బాగానే చేశారు. కానీ ఏదో తెలియని వెలితి. ఆ కొలువు వారికి సంతోషాన్ని ఇవ్వట్లేదు. ఏం చేయాలని ఆలోచించారు. చాలా తక్కువ ఖర్చుతో ఒక బిర్యానీ స్టాల్ ప్రారంభించారు. ప్రస్తుతం వారు బిర్యానీ అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
Advertisement
ఇప్పుడు ఎలా ఉంది బతుకుదెరువు అని అడిగితే జాబ్ చేసినప్పటి కంటే ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నామని, సొంత బిజినెస్ తో బ్రహ్మాండంగా ఉందని చెప్పుకొచ్చారు యువ ఇంజనీర్లు. హర్యానా రాష్ట్రంలోని సోనీపాట్ అది సంపన్నులు ఉండే ఏరియా కాబట్టి వారికి ఫుల్ బిజినెస్. అయితే ఈ బిర్యానికి ఇంజనీర్స్ వెజ్ బిర్యాని అని పేరు కూడా పెట్టారు జనాలు. ఆ ఇమేజ్ తో వారి బిర్యాని సెంటర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. ఇందులో బిర్యాని 70 రూపాయలు ఇచ్చి కడుపు నింపాలి అనేది వారి ముందున్న లక్ష్యం. అదే బాటలో నడుస్తూ ఎంతోమందికి రోల్ మోడల్ అవుతున్నారు ఆ యువకులు.
ఇవి కూడా చదవండి :
APRIL 17th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!
చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన 10 మంది సినీతారలు….వారి మృతికి కారణాలు….!
పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఏడాదిలోపే ఎందుకు తీస్తారో మీకు తెలుసా..!!