Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » అల్లుఅర్జున్ ట్వీట్‌.. హ్యాట్సాప్ అంటూ నెటిజ‌న్లు.. ట్వీట్‌లో ఏముందంటే..?

అల్లుఅర్జున్ ట్వీట్‌.. హ్యాట్సాప్ అంటూ నెటిజ‌న్లు.. ట్వీట్‌లో ఏముందంటే..?

by Anji
Ads

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా న‌టించిన తాజా పాన్ ఇండియా చిత్రం పుష్ప పెద్ద స‌క్సెస్ సాధించిన విష‌యం అంద‌రికీ తెలిసిన‌దే. తెలుగు స‌హా ప‌లు ఇత‌ర భాష‌ల్లో మంచి క‌లెక్ష‌న్లు అందుకున్న ఈ సినిమాపై అటు నార్త్‌లో ప‌లువురు ఆడియ‌న్స్ తో పాటు సినీ ప్ర‌ముఖులు, విశ్లేష‌కులు సైతం ప్ర‌శంస‌లు కురిపిస్తుండ‌టంతో విశేషంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ చిత్రంలో పుష్ప‌రాజ్‌గా అల్లు అర్జున్ అద్భుత న‌ట‌న, శ్రీ‌వ‌ల్లి పాత్ర‌లో ఎంతో ఒదిగిపోయి యాక్ట్ చేసిన హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న‌, సినిమాను ఆకట్టుకునేవిధంగా ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కించాడు. అదేవిధంగా అద్భుత‌మైన పాట‌లు, జీజీఎం అందించిన దేవీప్ర‌సాద్‌, వండ‌ర్పుల్ విజువ‌ల్స్తో తెర‌కెక్కించిన కెమెరామ్యాన్ క్యూబా స‌హా అనేక మంది యూనిట్ స‌భ్యులు పుష్ప భారీ స‌క్సెస్ లో పాత్ర వ‌హించారు.

Advertisement

Pushpa Box Office collection: Allu Arjun film crosses Rs 325 crore  worldwide - BusinessToday

Ad

Advertisement

ఇక ఈ సినిమా మేనియా ఈరోజు రోజుకు విప‌రీతంగా పెరుగుతూ ఉండ‌డం నిత్యం ప‌లు సోష‌ల్ మీడియా మాద్య‌మాల్లో చూస్తున్నాం. త్వ‌ర‌లో పుష్ప పార్ట్‌-2 షూట్‌లో జాయిన్ కానున్నారు అల్లుఅర్జున్‌. అస‌లు విష‌యం ఏంటంటే.. ఇవాళ కొద్ది సేప‌టి క్రిత‌మే త‌న రూమ్ మొత్తాన్ని త‌న ఇంట్లోని ప‌ని వారు, అదేవిధంగా త‌న‌తో క‌లిసి ప‌ని చేసే టీమ్ అంద‌రూ కూడా పుష్ప మూవీ లుక్‌ను ప్ర‌తిబింబించేలా త‌యారు చేసినందుకు త‌న సోష‌ల్ మీడియా మాద్య‌మాల వేదిక‌గా వారందరికీ ప్ర‌త్యేకంగా అల్లుఅర్జున్‌ కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. ఈ ట్వీట్‌లో మ‌రొక విశేష‌మేంటంటే వారంద‌రినీ త‌న ఫ్యామిలీగా అల్లు అర్జున్ సంబోధించ‌డంతో ప‌లువురు ప్రేక్షాభిమానులు ఆయ‌న నుంచి మంచి మ‌న‌స్సుకు హ్యాట్సాప్ అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

Visitors Are Also Reading