Home » రజనీకాంత్ కు ఆ ఒక్క విషయంలో ఇంత అవమానం జరిగిందా..?

రజనీకాంత్ కు ఆ ఒక్క విషయంలో ఇంత అవమానం జరిగిందా..?

by Sravanthi
Ad

కోలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలా ఇండస్ట్రీలలో రజనీకాంత్ కు మంచి పాపులారిటీ ఉంది. బస్ కండక్టర్ నుంచి మొదలైన ఆయన జీవితం రాజకీయాలకు బాట వరకు కొనసాగింది. ఆయన అడుగుజాడల్లోనే స్టార్ హీరోలు కూడా రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. సినిమాల్లో సూపర్ స్టార్ గా వెలుగొందడం చాలా ఈజీ కానీ, రాజకీయం చేయడం అంత మామూలు విషయం కాదు. అందుకే ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి రావాలంటే ఆలోచించి అడుగులు వేస్తుంటారు. మెగాస్టార్ లాంటి స్టార్ హీరోనే రాజకీయాల్లోకి వచ్చి బోల్తాపడ్డారు.

also read:చిరంజీవిని ఆ థియేటర్ వద్ద ఉరికించుకుంటూ కొట్టింది ఎవరో తెలుసా..?

Advertisement

ఈ తరుణంలో రజనీకాంత్ కూడా ఒక్కసారి రాజకీయాల్లోకి అడుగు పెట్టామంటే ముందుకు వెళ్లడమే కానీ వెనక్కి రావడం జరగదు అని వెనక్కి వచ్చామా మనం ఓడిపోయినట్టే అని తనకు తాను సంసిద్ధం ఉంటుంది అని అన్నారు. ఇక ప్రతి ఒక్కరు కూడా రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ఆయన కూడా రాజకీయపరంగా ముందుకు వస్తానని తన అభిమానులకు మాటిచ్చాడు. అలా మాట ఇచ్చిన తర్వాత అప్పటికే ఒప్పుకున్న కొన్ని సినిమాలు వరుస పెట్టి చేయాల్సి వచ్చింది. దానికోసం చాలా సంవత్సరాల సమయం పట్టింది. అప్పటికి రజనీకాంత్ ఆరోగ్యం కాస్త క్షీణించింది. తన కిడ్నీ 60 శాతం డ్యామేజ్ అయింది అన్న విషయం తెలిసి రజినీకాంత్ షాక్ అయ్యారు. కానీ ఎలాగైనా రాజకీయాల్లోకి వస్తానని కమిట్ అయ్యాడు కాబట్టి వెనక్కి వెళ్ళకూడదు అనుకున్నాడు.

Advertisement

ఎలాగైనా జనాల్లోకి వెళ్లి క్యాంపెయిన్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో కరోనా తీవ్రత పెరిగింది. దీంతో ఆయన రాజకీయాల్లో కాస్త వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఫస్ట్ వేవ్ తగ్గింది మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నాడు. ఇంతలో సెకండ్ వేవ్ ప్రమాద హెచ్చరికలు వచ్చాయి. ఇక క్యాంపెయిన్ కి సిద్ధమవుతున్న తరుణంలో రజినీకాంత్ వ్యక్తిగత వైద్య నిపుణులు ఒప్పుకోలేదు. ఒకవేళ నువ్వు జనాల్లోకి వెళితే దూరంగా ఉండాలని మాస్క్ పెట్టుకోవాలని సానిటైజర్ వాడాలంటూ సూచనలు చేశారు. కానీ ఇవన్నీ జరగడం అసాధ్యమని భావించిన రజనీకాంత్ క్యాంపెయిన్ నుంచి విరమించుకున్నాడు. ఈ విధంగా రాజకీయాల్లోకి వస్తానని జనాలకు చెప్పి రాకపోవడంతో ఆయన్ను చాలామంది అవమానపరిచారు.

also read:

Visitors Are Also Reading