Home » చిరంజీవిని ఆ థియేటర్ వద్ద ఉరికించుకుంటూ కొట్టింది ఎవరో తెలుసా..?

చిరంజీవిని ఆ థియేటర్ వద్ద ఉరికించుకుంటూ కొట్టింది ఎవరో తెలుసా..?

ఎవరి జీవితమైనా సరే కొన్ని తీపి గుర్తులు లేకపోతే ఆ జీవితమే వేస్ట్ అని చెప్పవచ్చు. ఎంతటి సంపన్నులైనా ఎంత గొప్ప వ్యక్తులైన వారి జీవితంలో ఏదో ఒక తీపి గుర్తు అనేది ఉంటుంది. ఒక్కోసారి అలాంటి గుర్తులను స్మరించుకొని అప్పుడు జరిగిన విశేషాలను గుర్తు చేసుకుంటారు. అలా మెగాస్టార్ చిరంజీవి జీవితంలో కూడా ఒక తీపి గుర్తు ఉందట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మెగాస్టార్ చిరంజీవి మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. తాను తన తల్లిదండ్రుల చేతిలో తీవ్రంగా దెబ్బలు తిన్నానని ఆరోజు నేను మర్చిపోలేనని అన్నారు. ఎప్పుడు జరిగిందో చూద్దామా..

also read:అఖిల్ ఏజెంట్ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే ?

 

చిరంజీవికి సరిగ్గా 11 నుంచి 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆరవ తరగతి చదువుతున్నారట. ఆ సమయంలో ఏవీఎస్ సంస్థ వారు నిర్మించిన రాము అనే చిత్రం విడుదలైంది. నేను ఎన్టీఆర్ కు పెద్ద ఫ్యాన్ కాబట్టి మొదటి రోజు ఫస్ట్ షో చూడాలని ఫిక్స్ అయిపోయాను. ఎలా గోల టికెట్స్ సంపాదించి నెల్లూరు ఒక థియేటర్లో సినిమా చూసి బయటకు వస్తున్నాను. అప్పటికే రద్దీ ఎక్కువగా ఉండడంతో అక్కడికి పోలీసులు వచ్చారు. మా నాన్న పోలీస్ కానిస్టేబుల్ కాబట్టి ఆ రద్దీలో నేను నలిగిపోతుంటే నన్ను చూశారు.

also read:దర్శకుడు శంకర్ నటించిన సినిమాలు ఏవో మీకు తెలుసా ?

వెంటనే కోపాన్ని ఆపుకోలేక అక్కడే ఉన్న కొబ్బరి మట్ట తీసుకొని కొట్టుకుంటూ నెల్లూరు కనకామహల్ థియేటర్ నుంచి మునఫెట్ వరకు కొట్టుకుంటూ ఈడ్చుకెళ్ళారు. నాన్నకు ఆవేశం వస్తే ఇక అంతే ఆరోజు చావ బాధేస్తారు. ఇప్పటికీ ఏవీఎం పేరు చెప్పినా రాము సినిమా చూసిన నాకు ఆ సంఘటన గుర్తుకొస్తుంది అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఈ విషయం ఎవరికీ చెప్పలేదని చెబితే పరువు పోతుందని అనుకున్నానని చిరంజీవి తెలిపారు. ఇక నా జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయని, ఆ పిక్చర్ నన్ను ఈ రోజు మెగాస్టార్ అయ్యేలా చేసిందని చెప్పుకొచ్చారు.

also read:ఎన్టీఆర్ సినిమాకెళ్లి చిరంజీవి దెబ్బలు తిన్నాడనే విషయం తెలుసా ?

Visitors Are Also Reading