ఐపీఎల్ 2024 సీజన్ నుంచి ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో తాను ఈ సీజన్ ఆడటం లేదని వెల్లడించాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన అతను దారుణంగా విఫలమయ్యాడు. దాంతో ఆ జట్టు అతన్ని వదిలేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది. మరో వారం రోజుల్లో ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుండగా.. తాను ఆడలేనని హ్యారీ బ్రూక్ ఫ్రాంచైజీకి సమాచారం ఇచ్చాడు. హ్యారీ బ్రూక్ నిర్ణయంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌కు దూరంగా ఉండాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించారు.
Advertisement
Advertisement
ఈ క్రమంలోనే ఐపీఎల్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి తనకు ఎందుకు వచ్చిందో హ్యారీ బ్రూక్ ఎక్స్‌వేదికగా వెల్లడించాడు. తన అమ్మమ్మ ఫిబ్రవరిలో మరణించిందని, ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులతో ఉండాల్సిన అవసరం తనకు ఉందని చెప్పాడు. అప్ కమింగ్ ఐపీఎల్ సీజన్ ఆడవద్దనే కఠిన నిర్ణయాన్ని నేను తీసుకున్నాను. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగేందుకు నేను ఉత్సాహంగా ఎదురు చూశాను. అయితే నేను తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వెనుక ఉన్న కారణం చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు. చాలా మంది నేను ఎందుకు తప్పుకున్నానో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే ఈ పోస్ట్ షేర్ చేస్తున్నాను.
Also Read : ఆర్సీబీ సంచలన నిర్ణయం.. పేరులో స్వల్ప మార్పు..?