చిత్ర పరిశ్రమలో మరో ప్రేమ జంట పెళ్లి వైపు అడుగులు వేయడానికి నిర్ణయించుకుంది. ఆ ప్రేమకులిద్దరూ తెలుగు వాళ్ళు కాదు. కానీ తెలుగు సినిమాలతో వారికి టచ్ ఉంది. ఆ జంటనే, హరిప్రియ వశిష్ట, సింహ. శాండల్ వుడ్ నటి హరిప్రియ, కేజిఎఫ్ నటుడు వశిష్ట సింహతో పెళ్లికి సిద్ధమైంది. డిసెంబర్ 2న నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు ఇద్దరు తమ ఎంగేజ్మెంట్ ఫోటోలను ఇన్ స్టా వేదికగా షేర్ చేశారు.
Advertisement
“మేమిద్దరం ఒక్కటి కాబోతున్నాం. మా నిశ్చితార్థం వేడుకగా జరిగింది. మీ ఆశీస్సులు కావాలి” అని పోస్ట్ పెట్టారు. బెంగళూరులోని హరిప్రియ నివాసంలో ఈ నిశ్చితార్థం వేడుక జరగగా, ఈ కార్యక్రమానికి వశిష్ట, హరిప్రియ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈ ఎంగేజ్మెంట్ వేడుకలో హరిప్రియ పసుపు రంగు చీరలో ముస్తాబు కాగా, వశిష్ట పసుపు రంగు షర్ట్ తో పాటు దోతిని ధరించాడు.
Advertisement
ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా ‘తకిట తకిట’ చిత్రంతో హరిప్రియ టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత ‘పిల్ల జమిందార్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, గలాట, జై సింహ చిత్రాలలో నటించింది. అటు కేజిఎఫ్ లో కమల్ పాత్ర పోషించిన వశిష్ట సింహకు బాగానే గుర్తింపు వచ్చింది.
READ ALSO : ఇంగ్లండ్‌ను వణికిస్తున్న పాక్ మిస్టరీ స్పిన్నర్! ఎవరీ అబ్రార్?