Home » ఇంగ్లండ్‌ను వణికిస్తున్న పాక్ మిస్టరీ స్పిన్నర్! ఎవరీ అబ్రార్?

ఇంగ్లండ్‌ను వణికిస్తున్న పాక్ మిస్టరీ స్పిన్నర్! ఎవరీ అబ్రార్?

by Bunty
Ad

ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య శుక్రవారం రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ల్లో పాకిస్తాన్ యువ సంచలనం అరంగేట్ర టెస్టులోనే సంచలన ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండుతో జరుగుతున్న రెండో టెస్టులో పాక్ స్పిన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. ఈ 24 ఏళ్ల యువ బౌలర్ తన అరంగేట్రం మ్యాచ్లోనే ఏడు వికెట్లు తీసి ప్రత్యేక రికార్డు సృష్టించాడు.

READ ALSO : ఒక సారి వాడిన వంట నూనెను మళ్ళీ వాడుతున్నారా..?అయితే, ప్రాణాలకే ముప్పు తప్పదా !!

Advertisement

అబ్రార్ అహ్మద్ స్పిన్ దాటికి తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 51.4 ఓవర్లలో 281 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అబ్రార్ సంచలన బౌలింగ్ తో ఏడు వికెట్స్ పడగొట్టగా, జాహిద్ మహ్మద్ మూడు వికెట్లు తీశాడు. ఇక్కడ విశేషమేంటంటే, తొలి ఇన్నింగ్స్ లో మొదటి ఏడు వికెట్లు అబ్రర్ పడగొట్టినవే. తొలి ఇన్నింగ్స్ లో పాక్ యువ స్పిన్నర్ 22 ఓవర్లలో 114 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు తీశాడు. దాంతో అరంగేట్ర టెస్టులో ఒక ఇన్నింగ్స్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మూడో బౌలర్ గా అబ్రార్ నిలిచాడు.

Advertisement

అబ్రార్ ఎవరో తెలుసా ?

అబ్రార్, పాకిస్తాన్ లోని అబౌటాబాద్ సమీపంలోని మన్సెహ్ర శివార్లలోని షింకియారి అనే చిన్న గ్రామానికి చెందినవాడు. అతని తల్లి 1977లో కరాచీకి వెళ్లి అక్కడే స్థిరపడడంతో, అబ్రార్ అక్కడే పుట్టి పెరిగాడు. అబ్రర్ తండ్రికి క్రికెట్ అంటే ప్రాణం. పాకిస్తాన్ టీంకు ఆయన వీరాభిమానిగా ఉండేవాడు. ఎనిమిది మంది సంతానంలో అబ్రార్ అందరి కంటే చిన్నవాడు. తన నలుగురు అన్నల్లో ఒకతను దేశవాలి క్రికెట్ ఆడాడు. అబ్రార్ కూడా క్రికెట్ పై ఇష్టం. స్పిన్ బౌలర్ గా మారాడు. కానీ, తన తల్లి కోరిక మేరకు రెండేళ్లు క్రికెట్కు పూర్తిగా దూరమై, చదువుపై దృష్టి పెట్టాడు. ఇస్లామిక్ స్టడీస్ లో పెద్ద చదువులు కూడా చదవాలనే తన తల్లి ఆదేశాలను ధిక్కరించి, క్రికెటర్ అవుతానని తల్లి వద్ద అనుమతి తీసుకుని, మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.

READ ALSO : డబుల్ సెంచరీ చేసిన హీరోలు..4 గురు ఇండియన్సే

Visitors Are Also Reading