Home » గుజరాత్ కెప్టెన్, కోచ్ యొక్క అద్భుతమైన రికార్డులు..!

గుజరాత్ కెప్టెన్, కోచ్ యొక్క అద్భుతమైన రికార్డులు..!

by Azhar
Ad

ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిపోయింది. ఈ ఏడాదే కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు టైటిల్ ను ఎగరేసుకుపోయింది. ఐపీఎల్ 2022 మెగవేలం తర్వాత అత్యంత చెత్త జట్టుగా క్రికెట్ విశ్లేషకులు అందరూ ఈ జట్టు పేరే చెప్పారు. దానికి తోడు కెప్టెన్ గా హార్దిక్ పాండ్య.. హెడ్ కోచ్ గా ఆశిష్ నెహ్రా ఉండటంతో ఈ జట్టు పరిస్థితి ఆ దేవుడికే తెలియాలి అంటూ కామెంట్స్ కూడా చేశారు. కానీ సీజన్ ముగిసిన తరువాత అప్పుడు విమర్శించినా నోరులే ఇప్పుడు వారిని ప్రశంసిస్తున్నాయి. ఇక ఈ టైటిల్ గెలవడంతో గుజరాత్ కెప్టెన్, కోచ్ కొన్ని అద్భుతమైన రికార్డులు నెలకొల్పారు.

Advertisement

అవేంటంటే.. ఈ ఫైనల్ మ్యాచ్ లో మొదట బంతితో మూడు కీలక వికెట్లు తీసిన పాండ్య తర్వాత బ్యాట్ తో 34 పరుగులు కూడా చేసాడు. దాంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఇక ఇలా ఫైనల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన మూడో కెప్టెన్ గా హార్దిక్ నిలిచాడు. గతంలో రోహిత్ శర్మ, అనిల్ కుంబ్లే ఇలా ఫైనల్స్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న కెప్టెన్లుగా ఉండగా.. వారి తర్వాత మూడో కెప్టెన్ గా పాండ్య అవతరించాడు.

Advertisement

అలాగే గుజరాత్ టైటిల్ గెలవడంతో జట్టు హెడ్ కోచ్ గా ఆశిష్ నెహ్రా కూడా ఓ ఘనత అందుకున్నాడు. అదేంటంటే ఇప్పటివరకు ఒక్క భారతీయ హెడ్ కోచ్ కూడా టైటిల్ గెలవలేకపోయాడు ఐపీఎల్ లో. గడిచిన 14 సీజన్లలో టైటిల్ గెలిచిన జట్ల యొక్క హెడ్ కోచ్లు అందరూ విదేశీయులే. దాంతో ఐపీఎల్ టైటిల్ అందుకున్న మొదటి భారత హెడ్ కోచ్ గా ఆశిష్ నెహ్రా నిలిచాడు. ఓ పేపర్ మీద రాస్తూ జట్టును సిద్ధం చేసిన నెహ్రాను చాలా మంది విమర్శించగా.. ఇప్పుడు అదే పెద్ద వ్యూహంగా అందరూ అనుకుంటున్నారు. అందువల్ల వచ్చే ఐపీఎల్ సీజన్ నుండి హెడ్ కోచ్ లు అందరూ నెహ్రాల పేపర్ పట్టుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు.

ఇవి కూడా చదవండి :

ఢీల్లీ క్యాపిటల్స్ కు ఆడుతూ.. రాజస్థాన్ రాయల్స్ కు మద్దతు ఇస్తున్నాడు..!

హార్దిక్ పాండ్య డ్రీమ్ ఐపీఎల్ కాదంట.. ఏంటో తెలుసా మరి..?

Visitors Are Also Reading