భారత సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్… ఐపీఎల్ 2022 లో చెలరేగుతున్న విషయం తెలిసిందే. జట్టు ఏదైనా కూడా చివర్లో వచ్చి వీరబాదుడు బాదుతున్నాడు. ఒకవేళ ముందే వికెట్లు పడిపోతే… వచ్చి నిలకడగా పరుగులు చేస్తున్నాడు. దాంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు కార్తీక్. ఈ క్రమంలో దినేష్ కార్తీక్ ని ప్రపంచ కప్ కు ఎంపిక చేయాలనే వాదన పెరుగుతుంది.
Advertisement
భారత సీనియర్ మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్… ఆ మధ్య నేనే సెలక్టర్ అయితే కార్తీక్ ను తప్పకుండా ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేస్తాను అని చేసిన కామెంట్స్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జాబితాలోకి చేరిపోయాడు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. తాజాగా హర్భజన్ మాట్లాడుతూ దినేష్ కార్తీక్ బెంగళూరు జట్టులో అదరగొడుతున్నాడు. అతను బెంగళూర్ జట్టుకు మంచి ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అలాగే పరుగులు చేస్తున్నాడు. మనం ఐపీఎల్ 2022 సీజన్ లో చూసుకున్నట్లయితే దినేష్ కార్తిక్ బెస్ట్ ఫినిషర్ గా కనిపిస్తాడు.
Advertisement
అందువల్ల అతడిని ఈ ఏడాది నవంబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ప్రపంచకప్ కు ఎంపిక చేయాలి అని హర్భజన్ అన్నారు. ఒకవేళ మీకు అతని వయసు సమస్యగా అనిపిస్తుంటే… అతను తీసే సింగిల్స్ కూడా చూడండి. చాలా చక్కగా… ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిగెడుతున్నాడు. నిజంగా నేనే సెలక్టర్ అయితే తప్పకుండా ప్రపంచ కప్ కు దినేష్ కార్తీక్ ను ఎంపిక చేయడం మాత్రమే కాకుండా తుది జట్టులో కూడా ఉంచుతాను. ఎందుకంటే.. కార్తీక్ కు భారత జట్టులో ఉండటం కంటే… టీం ఇండియాకు కార్తీక్ జట్టులో ఉండటం అవసరం అని అని హర్భజన్ తెలిపాడు
ఇవి కూడా చదవండి :
చెన్నై తదుపరి కెప్టెన్ అతనే..!
ఉమ్రాన్ కు టీం ఇండియాలో చోటు ఖాయం : గంగూలీ