తెలుగులో కాలేజీ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ చదువు విషయానికి వస్తే హ్యాపిడేస్ కు ముందు ఆ తర్వాత అని చెప్పుకునేలా ఈ సినిమా మార్పును తీసుకువచ్చింది. ఈ సినిమా తర్వాత ఇంటర్ పూర్తయిన వెంటనే చాలా మంది విద్యార్థులు ఇంజనీరింగ్ వైపు అడుగులు వేశారు.
Advertisement
దానికి కారణం ఈ సినిమాలో బిటెక్ స్టూడెంట్స్ లైఫ్ ను ఎంతో బ్యూటిఫుల్ గా చూపించడమే. ఇక ఈ సినిమాలో తమన్నా వరుణ్ సందేశ్ ముఖ్యమైన పాత్రలలో నటించినప్పటికీ వారి స్నేహితులు గా నటించిన వాళ్లకు కూడా సినిమాలో ప్రాధాన్యత లభించింది. ఇక ఈ చిత్రంలో నిఖిల్ కు గర్ల్ ఫ్రెండ్ గా అప్పు ఆమె అసలు పేరు (గాయత్రీరావు )నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అప్పు టామ్ బాయ్ లుక్ లో కనిపిస్తూ ఉంటుంది.
Advertisement
ఎప్పుడూ ప్యాంట్ షర్ట్ వేసుకునే అమ్మాయిలా కనిపిస్తుంది. ఆమె పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ సినిమా తర్వాత గాయత్రి రావుకు ఆరెంజ్ సినిమాలో నటించింది. అంతే కాకుండా గబ్బర్ సింగ్ సినిమాలో కూడా నటించింది అలరించింది. కానీ ఆ విషయం ఎవరికీ తెలియదు.
గబ్బర్ సింగ్ సినిమాలో శృతిహాసన్ సోదరిగా కనిపించింది కానీ హ్యాపీ డేస్ సినిమా లో ఉన్న లుక్ కు గబ్బర్ సింగ్ సినిమాలో కనిపించిన లుక్ కు చాలా తేడా ఉండటంతో ప్రేక్షకులు గుర్తు పట్టలేకపోయారు. అయితే ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో గాయత్రి రావు పూర్తిగా సినిమాలకు దూరం అయింది. అంతే కాకుండా ప్రస్తుతం గాయత్రి రావు పెళ్లి చేసుకుని చెన్నైలో భర్తతో కలిసి సెటిల్ అయింది. అయినప్పటికీ సినిమా అవకాశాలు వస్తే నటిస్తానని చెబుతోంది.
Also read :
కుర్రాళ్ల మనసు దోచేసిన “మన్మధుడు” హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఎవరెవరు ఏం చదువుకున్నారో తెలుసా…? ఆ ముద్దుగుమ్మ అందరికంటే గ్రేట్…!