Happy New Year 2022 Images, Quotes, Greetings, Messages, Status in Telugu: డిసెంబర్ నెల వచ్చిందంటే ప్రతి ఒక్కరూ పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పాలని కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పాలని అనుకుంటారు. క్రిస్మస్ పండుగ నుండే న్యూయర్ వేడుకలను ప్రారంభిస్తూ ఉంటారు. ప్రతి యేడాది అలా న్యూయర్ వస్తూనే ఉంటుంది. కొంతమంది తాము ఉన్న ఊర్లు, పట్టణాల్లోనే న్యూయర్ ను సెలబ్రేట్ చేసుకుంటే మరి కొందరు న్యూయర్ వేడుకల కోసం గోవా లాంటి ప్రదేశాలకు వెళుతూ ఉంటారు. అయితే Happy New Year Wishes 2022 Telugu ప్రతియేడాది కొత్త సంవత్సరాన్ని చాలా ఘనంగా జరుపుకుంటారు కానీ అసలు న్యూయర్ ఎందుకు వచ్చింది. హ్యాపీ న్యూయర్ ఎందుకు చెప్పుకుంటామన్నది మాత్రం చాలా మందికి తెలియదు.
న్యూయర్ అంటే కొత్త సంవత్సరం అని అర్థం…గడిచిన సంవత్సరం ఎలా ఉన్నా అడుగుపెట్టబోయే కొత్త యేడాది మాత్రం భాగుండాలని అంతా భావిస్తుంటారు. అందువల్లే సంతోషంతో సెలబ్రేషన్లతో కొత్త యేడాదికి వెల్ కమ్ చెబుతూ ఉంటారు. మనం జనవరి ఒకటవ తేదీనే న్యూయర్ జరుపుకుంటాం. Happy New Year Images 2022 Telugu కానీ మొదట్లో రోమన్ క్యాలెండర్ ఉండేది అందులో యేడాదికి పది నెలలు మాత్రమే ఉంటాయి. అంతే కాకుండా 304 రోజులుంటాయి. ఈ క్యాలెండర్ ప్రకారం మార్చి 1న న్యూయర్ ను జరుపుకునేవారు.
Advertisement
Advertisement
ఈ క్యాలెండర్ ను రోమన్ రాజ్యం వాడేది అయితే ఫస్ట్ సివిల్ వార్ గెలిచిన తరవాత జూలియస్ సీజర్ రోమన్ క్యాలెండర్ లో మార్పులు చేసి 46బీసీలో కొత్త క్యాలెండర్ ను తీసుకువచ్చారు. ఈ క్యాలెండర్ లో 12నెలలు ఉన్నాయి. అంతే కాకుండా నార్మల్ సంవత్సరం అయితే 365 రోజులు, లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉన్నాయి. జనవరి అనే పేరు కూడా జోనస్ అనే ఓ రోమన్ దేవుడి పేరుమీద నుండి వచ్చింది. ఇక అప్పటి నుండి జనవరి 1న న్యూయర్ వేడుకలను జరుపుకుంటున్నారు. కొన్ని దేశాల్లో న్యూయర్ జరుపుకునే నెలల్లో తేడాలు కూడా ఉన్నాయి. కానీ జనవరి 1న మాత్రం ఎక్కువ దేశాలు న్యూయర్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నాయి.
Happy New Year Images 2022 in Telugu