Home » ‘హను మాన్’ ఆల్ ఇండియా వైడ్ గా సరికొత్త రికార్డు

‘హను మాన్’ ఆల్ ఇండియా వైడ్ గా సరికొత్త రికార్డు

by Anji

టాలీవుడ్  మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ  ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండియన్ సినిమాగా మారారు. జనవరి 12 న విడుదలైన  హనుమాన్  సినిమా పెద్ద సినిమాల తాకిడికి తట్టుకుని బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. తేజ సజ్జ పెర్పార్మేన్స్ నెక్స్ట్ లెవెల్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తునారు. ఈ క్రమంలో హనుమాన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పండగ సీజన్ కావడంతో గుంటూరు కారం సినిమా బడ్జెట్ ను బట్టి వసూళ్ళు రాబట్టాలిసిన అవసరం ఉంది. కాబట్టి ఈ సినిమాకు అధిక సినిమా థియేటర్స్ కేటాయించడం జరిగింది.

HanuMan-Review

హనుమాన్ మూవీకి చాలా తక్కువ థియేటర్స్ ఇచ్చారు. అయితే పండగ సీజన్ కాబట్టి స్టార్ హీరోల సినిమాలకు ఉండే క్రేజ్ దృష్ట్యా హనుమాన్ టీం ఆ కొన్ని థియేటర్స్ లోనే రిలీజ్ చేసారు.మొదటి షో తోనే పాజిటివ్ టాక్ రావడంతో ఊహించని విధంగా థియేటర్స్ పెంచాల్సిన పరిస్తితి ఎదురయింది. షో కి షో కి థియేటర్స్ హౌస్ ఫుల్ల్స్ అవుతుండటం.. ఎక్కడ చూసినా హను మాన్ నామ స్మరణమే ఉండటంతో థియేటర్స్ పెంచారు.  సినిమా మీద ఉన్న నమ్మకంతోనే మేకర్స్ పెయిడ్ ప్రిమియర్స్  స్టార్ట్ చేసారు. ఈ షో లకి విపరీతమైన్స స్పందన రావడంతో పెయిడ్ ప్రిమియర్స్ థియేటర్స్ సంఖ్యను పెంచారు.

ఈ సినిమా పెయిడ్ ప్రిమియర్స్ కు రికార్డు స్థాయిలో స్పంధన రావడంతో హను మాన్ ఏకంగా ఇండియన్ రికార్డు సెట్ చేసిందని హనుమాన్ మేకర్స్ చెబుతున్నారు. పెయిడ్ ప్రీమియర్స్ షో లలో బారతః దేశంలోనే అత్యధిక వసూళ్ళు సాధించిన మొట్టమొదటి సినిమాగా హను మాన్ నిలిచిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హను మాన్. సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మొదటి సినిమాగా తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిభని యావత్ భారతదేశం కొనియాడుతోంది. హను మాన్ ప్రమోషన్స్ లో ప్రశాంత్ వర్మ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading