Home » పరిస్థితులు మారాయి.. ఒకప్పుడు ఛీ కొట్టినవాళ్లే.. ఇప్పుడు తిరిగి రమ్మని బతిమాలుతున్నారు..!

పరిస్థితులు మారాయి.. ఒకప్పుడు ఛీ కొట్టినవాళ్లే.. ఇప్పుడు తిరిగి రమ్మని బతిమాలుతున్నారు..!

by Mounika

అల్లు అర్జున్ నటించిన దేశముదురు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాలతార హన్సిక మోత్వానీ. ఈ చిత్రంలో సన్యాసినిగా నటించి తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ మరియు అందంతో యువతను ఫిదా చేసేసుకుంది.  చైల్డ్ ఆర్టిస్ట్ గా హన్సిక  హిందీలో హవా అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యింది. హిందీలో బాలనటిగా ఎన్నో చిత్రాలు నటించిన హన్సిక.. టాలీవుడ్ ఇండస్ట్రీ ద్వారా హీరోయిన్ గా పరిచయం అవ్వటం విశేషం. చిన్న వయసులోనే  టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువకాలంలోనే తెలుగు, తమిళ్ భాషలలో ఎంతోమంది అగ్ర కథానాయకులతో నటించి  స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది.

Hansika motwani

ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ ద్వారా హన్సిక తన కెరీర్లో ఎదురైన చేదు అనుభవాలు గుర్తు చేసుకున్నారు. దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న సమయంలో హన్సికకు బాలీవుడ్ లో అవమానాలు ఎదురయ్యాయని, అక్కడి డిజైనర్స్ ఆమెను చాలా తక్కువగా చూసేవారని చెప్పుకోచ్చారు. సౌత్ హీరోయిన్స్ అంటే బాలీవుడ్ ఇండస్ట్రీవారికి చులకన భావన ఉండేదట. మీరు సౌత్ హీరోయిన్ అయిన కారణంగా మీకు మేము దుస్తులు ఇవ్వమని ముఖం మీద చెప్పి డిజైనర్స్ ఆమెను అవమానించారని హన్సిక చెప్పుకొచ్చారు.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఒకప్పుడు ఎవరైతే దక్షిణాది హీరోయిన్ అని చిన్నచూపు చూశారో..    వారంతట వారే స్వయంగా వచ్చి మీకు ఏదో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉన్నట్లుంది. మరీ ఇలాంటి సమయంలో మేము డిజైన్ చేసిన డ్రెస్ వేసుకోవచ్చు కదా అంటూ బతిమాలుతున్నారు. వారి అప్పటి మాటలకు, ఇప్పటి మాటలకు చాలా చాలా వ్యత్యాసం ఉంది. గతంలో వాళ్లు అలా చులకనగా మాట్లాడిన మాటలకు మేము ఎటువంటి ద్వేషము పెంచుకోలేదు. దానికి బదులుగా నేనింకా కష్టపడి, వాళ్లను నా పనితో తిరిగి రప్పించేలా చేయాలని పట్టుదలతో ఉండేదాన్ని. అప్పుడు ఛీ కొట్టినవాళ్లే.. ఇప్పుడు తిరిగి వచ్చి బతిమాలుతుంటే ఆశ్చర్యమేసింది అంటూ హన్సిక తనకు ఎదురైన అనుభవాల గురించి ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చారు.

మరిన్ని ముఖ్య వార్తలు ! 

పుష్ప 2 టీజ‌ర్ లో ఇవి గ‌మ‌నించారా…? సుకుమార్ ఇవ్వ‌బోతున్న ట్విస్ట్ అదేనా..? 

శ్రీదేవి డ్రామా కంపెనీలో కండ‌క్ట‌ర్ జాన్సీకి ఛాన్స్ ఎలా వ‌చ్చిందో తెలుసా..? ఒక్క డ్యాన్స్ కు ఎంత తీసుకుందంటే..?

ఒకప్పుడు వెలుగు వెలిగి వీల్ చైర్ కే పరిమితమైన నటీనటులు వీళ్ళే..!

Visitors Are Also Reading