Home » హ్యాంగోవర్ ఎలా వస్తుంది..హ్యాంగోవర్ రాకూడదు అంటే ఏం చేయాలి..?

హ్యాంగోవర్ ఎలా వస్తుంది..హ్యాంగోవర్ రాకూడదు అంటే ఏం చేయాలి..?

by AJAY
Ad

చాలామంది మద్యం సేవించేటప్పుడు ఎంజాయ్ చేస్తారు కానీ మరుసటి రోజు ఉదయాన్నే తలపట్టుకుంటారు. అయితే అది సాధారణ తలనొప్పి కాదు హ్యాంగోవర్. ముందు హ్యాంగోవర్ అంటే ఏంటో తెలుసుకుందాం. మద్యం సేవించిన వ్యక్తికి దాని దాని ద్వారా కొన్ని ఇబ్బందికర లక్షణాలు ఏర్పడతాయి. దానినే హ్యాంగ్ ఓవర్ అని అంటారు. మద్యం సేవించి తరవాత కొన్ని గంటలకు ఇది మొదలవుతుంది. ఆల్కహాల్ శరీరంలోకి చేరినప్పుడు అది వెంటనే రక్తంలోకి చేరుతుంది.

Advertisement

Advertisement

ఆల్కహాల్ శరీరంలోని నీటిని తీసుకుంటూ ఉంటుంది. మద్యం తీసుకున్న తరవాత ఎక్కువగా టాయిలెట్ వస్తుంది. అలా ఎక్కువ సార్లు టాయిలెట్ రావడం వల్ల శరారంలోని నీటిశాతం తగ్గిపోతుంది. దాంతో శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. దానివల్ల తలనొప్పి చిరాకు వస్తాయి. మద్యం సేవించి తరవాత కడుపులో యాసిడ్ లు ఎక్కువగా విడుదల అవుతాయి. వాటివల్ల కడుపు నొప్పి మరియు విరేచనాలు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

 

అంతే కాకుండా మనం తీసుకున్న ఆల్కహాల్ శరీరంలోని రసాయనాల సమతుల్యత ను కూడా దెబ్బ తీస్తుంది. దానివల్ల తల తిప్పడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక మద్యం సేవించిన తరవాత కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే హ్యాంగోవర్ నుండి బయటపడవచ్చు. మద్యం సేవించినప్పుడు ఆహారం తీసుకోవడం మర్చిపోవద్దు. ఎక్కువ నీటిని తాగాలి. నిమ్మరసం నీటిని తాగడం కూడా హ్యాంగోవర్ నుండి రక్షిస్తుంది.’

Visitors Are Also Reading