Home » రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్ గుంటూరు కారం..!

రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్ గుంటూరు కారం..!

by Sravya
Ad

మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. సంక్రాంతి స్పెషల్ గా శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది గుంటూరు కారం. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు తాండవం చేస్తోంది. ఫస్ట్ డే సినిమా ఆల్ టైం రికార్డ్ కొట్టింది. సినిమా రిలీజ్ అయిన రోజు కావాలని కొందరు నెగటివ్ టాక్ ప్రచారం చేశారు. అయినా సరే ఎఫెక్ట్ పెద్దగా పడలేదు. గుంటూరు కారం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 94 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఫస్ట్ డే కలెక్షన్లతో సినిమా యూనిట్ అధికారికంగా ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు.

Advertisement

Advertisement

ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. గుంటూరు కారం మొదటి రోజు సోషల్ మీడియాలో భారీగా నెగిటివ్ ప్రచారం జరిగింది. అజ్ఞాతవాసి సినిమాతో ఈ సినిమాని పోల్చారు. సినిమా ఫస్ట్ టాక్ తర్వాత భారీగా కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. కానీ గుంటూరు కారం సినిమా మాత్రం కలెక్షన్ల విషయంలో అసలు తగ్గట్లేదు. రెండవ రోజు హనుమాన్, సైన్ధవ్ సినిమాలతో పోటీ వున్నా గుంటూరు కారం సినిమాకి హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. మహేష్ కెరియర్ లో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్ లని సాధించిన సినిమాగా గుంటూరు కారం రికార్డు ని క్రియేట్ చేసింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading