Home » ఐదో టెస్టులో ఇంగ్లాండ్ విజ‌యం.. 45 ఏళ్ల రికార్డు బ్రేకు..!

ఐదో టెస్టులో ఇంగ్లాండ్ విజ‌యం.. 45 ఏళ్ల రికార్డు బ్రేకు..!

by Anji
Ad

టెస్ట్ క్రికెట్‌లో భార‌త జ‌ట్టుపై ఇంగ్లాండ్ ఓ స‌రికొత్త రికార్డు సృష్టించింది. టెస్ట్‌ల్లో భార‌త్‌పై అత్య‌ధిక ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించిన జ‌ట్టుగా ఇంగ్లాండ్ రికార్డుల‌కెక్కింది. ముఖ్యంగా ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ గెల‌వాల‌న్న భార‌త్ క‌ల ఇప్ప‌ట్లో తీరేవిధంగా క‌నిపించ‌డం లేదు. దాదాపు 10 నెల‌ల కింద‌టే 2-1 ఆధిక్య‌త‌ను సాంపాదించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న భార‌త జ‌ట్టు తాజాగా ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా భార‌తజ‌ట్టుతో జ‌రిగిన ఐద‌వ టెస్ట్‌లో 378 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఇంగ్లాండ్ అల‌వ‌క‌గా ఛేదించింది.


చ‌రిత్ర‌లో ఎన్న‌డు లేనివిధంగా 378 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో రెండ‌వ ఇన్నింగ్స్ లో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్ జోరూట్ (142), జాని బెయిర్ స్టో (114) ఇద్ద‌రూ శ‌త‌కాల‌తో అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా రూట్ 82 స్ట్రైక్ రేట్‌తో అత‌ని కెరీర్‌లో 28వ సెంచరీ సాధించాడు. బెయిర్ స్ట్రో 78 స్ట్రైక్ రేట్‌తో 114 ప‌రుగులు సాధించాడు. అత‌నికి ఇది వ‌రుస‌గా నాలుగ‌వ సెంచ‌రీ కాగా.. ఓవ‌రాల్‌గా 12వ సెంచరీ. రెండు ఇన్నింగ్స్‌లో సెంచ‌రీలు సాధించి ఇంగ్లాండ్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన బెయిర్ స్టో కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పుర‌స్కారం ల‌భించింది.

Advertisement

Advertisement

1977లో పెర్త్ వేదిక‌గా భార‌త్‌లో జ‌రిగిన టెస్ట్ మ్యాచ్‌లో 339 ప‌రుగ‌ల టార్గెట్‌ను ఆస్ట్రేలియా జ‌ట్టు ఛేదించింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఇదే అత్య‌ధికం కాగా.. తాజాగా ఈ మ్యాచ్‌తో ఆసీస్ రికార్డును ఇంగ్లాండ్ బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విష‌యానికొస్తే భార‌త్ పై ఇంగ్లాండ్ 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 378 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ జ‌ట్టు కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేదించింది. ఈ విజ‌యంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో ఇంగ్లాండ్ స‌మం చేసింది.

Also Read : 

జియో, ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ల‌కు శుభ‌వార్త‌.. రూ.100 లోపు ల‌భించే ఈ ప్లాన్‌ల గురించి మీకు తెలుసా..?

వాట్సప్ లో కొత్తగా ఈ ఆప్షన్ వచ్చిందని తెలుసా ?

Visitors Are Also Reading