వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను వసూలు చేసుకునేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్న రాయితీ ఐడియాకు భారీ స్పందన వస్తోంది. ప్రభుత్వం కల్పించిన ఆఫర్‌తో ఇలాంటి సమయంఓలనే తమ చలాన్లను క్లియర్ చేసుకోవాలని భావిస్తున్నారు. చలాన్లు చెల్లించేందుకు అర్థరాత్రి నుంచి అమలులోకి రావడంతో తొలి 8 గంటల్లోనే లక్షా 77వేల చలాన్లను వాహనదారులు క్లియర్ చేశారు. వీటి ద్వారా రూ.కోటి 77 లక్షలు వచ్చాయి. ఇప్పటివరకు 5లక్షల చలాన్లను వాహనదారులు క్లియర్ చేశారు. వీటి ద్వారా రూ.కోటి 77 లక్షలు వచ్చాయి. ఇప్పటివరకు 5 లక్షల చలాన్లు క్లియర్ అయినట్టు అధికారులు వెల్లడించారు.
Also Read : ఆస్ట్రేలియా క్రికెటర్‌కు వింత అనుభవం.. టాయిలెట్‌లో చిక్కుకుపోయి..!
Advertisement
Advertisement
ఈ చలాన్ల విలువ రూ.20కోట్లు అంటే రాయితీ పోను రూ.5కోట్లు వసూలు అయ్యాయని వెల్లడించారు. ఈనెల 31 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. వెబ్ సైట్ లోనూ ఈ విషయాన్ని పొందుపరిచారు. వాహనదారులు తమ చలాన్లను ట్రాఫిక్ ఈ చలాన్, వెబ్‌సైట్, ట్రాఫిక్ పోలీస్ వెబ్‌సైట్ నేరుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి చెల్లించవచ్చు. వెబ్‌సైట్లలో లోక్ అదాలత్ ఆప్షన్‌ను ఎంచుకోగానే రాయితీ పోనూ కట్టాల్సిన సొమ్మును చూపిస్తుంది. ట్రాఫిక్‌పోలీసుల వెబ్‌సైట్‌తో పాటు మీ సేవలో చలాన్లు చెల్లించే అవకాశాన్ని పోలీసులు కల్పించారు. సాంకేతిక సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు సర్వర్ల సామర్థ్యం పెంచారు. యూపీఐ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చెల్లింపులు చేసేవిధంగా ఏర్పాట్లు చేశారు.
ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 75 శాతం, కార్లు, లారీలకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, తోపుడు బండ్లకు 80 శాతం రాయితీతో పెండింగ్ చలాన్లను చెల్లించే అవకాశాన్ని పోలీసులు క్పలించారు. కరోనా నిబంధనల్లో మాస్క్ ధరించని వారికి విధించిన జరిమానాలో 90 శాతం రాయితీ కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1750 కోట్ల రూపాయల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి.
Also Read : ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు పాకిస్తాన్‌కు ఎదురు దెబ్బ.. ఆ ఆటగాడికి కరోనా..!