Home » Telangana : మహిళ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త..!

Telangana : మహిళ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త..!

by Bunty

కేసీఆర్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మహిళ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏడు మార్కులు కలపడంతో అర్హత సాధించిన పోలీసు కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులు గర్భిణులు, ఇటీవల మాతృత్వం పొందిన తల్లులకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్టుల నుంచి తాత్కాలిక మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ దగ్గర కొంతమంది గర్భిణీ అభ్యర్థులు తమకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్టుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆందోళన చేశారు.


ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ మరోసారి ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. జనవరిలో ఇచ్చిన ఆర్డర్ ప్రస్తుతం కూడా వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చింది. ఏడు మార్కులు కలపగా అర్హత సాధించిన గర్భిణులు, ఇటీవల మాతృత్వం పొందిన తల్లులు తగు ఆధారాలతో నిర్ణీత ప్రొఫార్మాతో అధికారులకు దరఖాస్తు చేసుకుంటే వన్ టైం అవకాశం కింద తుది రాత పరీక్షకు హాజరు కావచ్చు అని వెల్లడించింది. ఫైనల్ పరీక్షల్లోను అర్హత సాధించినట్లయితే ఆ తర్వాత బోర్డు నిర్వహించే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కు విధిగా హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇక కేసీఆర్‌ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల లబ్ది దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

READ ALSO : Varasudu OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘వారసుడు’.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది

Visitors Are Also Reading