Home » Varasudu OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘వారసుడు’.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది

Varasudu OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘వారసుడు’.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది

by Bunty
Ad

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మాస్టర్, బీస్ట్ సినిమాల తర్వాత విజయ్ నటించిన తాజా చిత్రం వరిసు. ఈ సినిమా తెలుగులో వారసుడుగా విడుదల చేశారు. విజయ్ 66వ చిత్రం కావడంతో వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.

Advertisement

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి బ్యానర్లపై నిర్మాతలు రాజు, శిరీస్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు మంచి వసూలతో దూసుకెళ్లింది. సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు వచ్చిన వారసుడు చిత్రానికి తమిళంతో పాటు తెలుగులో కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే కుటుంబ కథ చిత్రంగా పరవాలేదనిపించిన ఈ చిత్రం ఎప్పుడు ఓటీటి స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది.

Advertisement

ప్రముఖ ఓటిటి వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఫిబ్రవరి 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది. తమిళ, తెలుగు భాషతో పాటు హిందీ ఆడియోను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారట. మరోవైపు ఓవర్సీస్ ప్రేక్షకుల కోసం ఈ మూవీ సన్ నెక్స్ట్ ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన ప్రకటన వచ్చేసింది. జనవరి 11న తమిళంలో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

Visitors Are Also Reading