ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగు పరచడానికి ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. ఫ్లాష్ కాల్స్ అనే మరో అదిరిపోయే ఫీచర్‌ను వాట్సాప్ విడుదల చేస్తోంది. ఈ ఫీచర్ యాప్ వెర్షన్ వాడే యూజర్లకు ప్రత్యామ్నాయ అథెంటికేషన్ ప్రాసెస్‌గా పని చేస్తుంది. ప్రస్తుతం వాట్సాప్ యాప్‌లో లాగిన్ కావాలంటే యూజర్లు తమ ఫోన్ నెంబర్ కి వచ్చిన ఆరు అంకెల ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్లాష్ కాల్స్ కొత్త వెరిఫికేషన్ మెథడ్ లేదా అథెంటికేషన్ స్టాండర్డ్‌తో ఆరు అంకెల కోడ్‌ను మాన్యువల్‌గా ఎంటర్ చేయకుండానే వాట్సాప్‌నకు లాగిన్ అవ్వవచ్చు.
Advertisement
ఫ్లాష్ కాల్స్ ఫీచర్‌తో లాగిన్ ప్రాసెస్ ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో ఫ్లాష్ కాల్స్ ఫీచర్‌ను వాట్సాప్ విడుదల చేస్తుంది. ఈ ఫీచర్ త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఫ్లాష్ కాల్స్ ఫీచర్ ఎస్ఎంఎస్ లేదా కాల్ ద్వారా యూజర్‌ల ఫోన్ నెంబర్ కు అందే ఆరంకెల ఓటీపీని వినియోగించకుండా వాట్సాప్ అకౌంట్‌నకు లాగిన్ చేసే ఒక కొత్త ఆటోమేటిక్ అథెంటికేషన్ ఆటోమెటిక్‌గా పూర్తి కావాలంటే యూజర్లు ఫ్లాష్ కాల్స్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. ఇక ఆపై వాట్సాప్ యూజర్లు ఆరు అంకె ఓటీపీని ఎంటర్ చేయాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో యూజర్లకు వాట్సాప్ ఒక మిస్డ్‌కాల్ లాంటి షార్ట్ కాల్ చేస్తుంది. ఆ కాల్‌ని ఉపయోగించే యూజర్ల అకౌంట్ వాట్సాప్ అథెంటికేట్ చేస్తుంది.
Advertisement
ఇక ఆ కాల్‌ని ఉపయోగించే యూజర్ల అకౌంట్‌ను వాట్సాప్ అథెంటికేట్ చేస్తుంది. యాప్ యూజర్ల లొకేషన్, ఎస్ఎంఎస్, కాల్ హిస్టరీని వాట్సాప్ యాక్సెస్ చేస్తుంది. అందుకే యూజర్లు వాట్సాప్ యాప్‌నకు తమ కాల్‌లాగ్స్ తో పాటు అవసరమైన వాటికి యాక్సెస్ అందించాలి. యూజర్లకు కాల్ చేసే ఫన్ నెంబర్ ఎల్లప్పుడూ డిఫరెంట్‌గా ఉంటుది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ చాలా సురక్షితమని వాట్సాప్ చెబుతుంది. వాట్సాప్ అకౌంట్లలో లాగిన్ చేయడానికి ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేయడం సాధ్యం కాదు. అలాగే వాట్సాప్ యూజర్ల కాల్ హిస్టరీ డేటాను ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దు. ఈ ఫీచర్‌ను ఏ ఇతర పరిస్థితుల్లో వాట్సాప్ వాడదు. వెరిఫికేషన్ కోడ్ ఫోన్ స్క్రీన్ పై కనిపించకుండా ఫ్లాష్ కాల్స్ ఫీచర్ లాగిన్ ప్రాసెస్ పూర్తి చేస్తుంది.
Also Read :
ఆ 4 యాప్స్ వెంటనే డిలీట్ చేయండి.. మళ్లీ ఆ మాల్‌వేర్ వచ్చేసింది..!