Home » తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు శుభవార్త.. కార్తీకదీపం 2 సీరియల్ త్వరలోనే..!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు శుభవార్త.. కార్తీకదీపం 2 సీరియల్ త్వరలోనే..!

by Anji
Ad

తెలుగు బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక మహిళలు అయితే ఈ సిరీయల్ వచ్చినప్పుడు ఏ పని చేసినా దానిని పక్కకు పెట్టి మరీ ఈ సీరియల్ ని చూసేవారు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కార్తీకదీపం మరుపురాని జ్ఞాపకాలను అందించిందనే చెప్పవచ్చు. ప్రధానంగా దేశ, విదేశాలలో తెలుగు వారి ఇండ్లలో కార్తీక దీపం సందడి చేయని రోజు ఉండదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సాయంత్రం 7.30 గంటలు అయిందంటే చాలు.. టీవీ స్క్రీన్స్ ముందు కూర్చుంటారు. 

Advertisement

ఈ సీరియల్ లో ప్రధాన పాత్రల్లో నటించిన కార్తీక్, దీప, సౌందర్యలకు ఉన్న ఆదరణ గురించి ఎంత చెప్పినా తక్కవనే. ప్రతీ గొప్ప కథకు గొప్ప ముగింపు ఉంటుందనే విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా అలరించిన కార్తీక దీపం సీరియల్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సీరియల్ లోని వంటలక్కకి సినీ హీరోయిన్ కి ఉన్నంత ఫ్యాన్స్ ఫాలోయింగ్  ఉంది. ఈ సీరియల్ ఉన్న పాపులారిటీతో వంటలక్కకు పలు సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. ఇందులో ప్రధాన పాత్రలో నటించినటువంటి కార్తీక్, దీప,సౌందర్య, మౌనితలతో పాటు పని మనిషి ప్రియమణికి కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్తీక దీపం సీరియల్ కి గుడ్ బై పడుతుండడంతో మరో రెండు రోజులు పోతే ఎలా అని అప్పుడే అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. కార్తీక దీపం లేకుండా.. చూడకుండా కష్టమే అంటూ తెగ బాధపడిపోతున్నారు. 

Also Read :   ఎన్టీఆర్ ని అలా.. అక్కినేని ని ఇలా శ్రీదేవి ఎందుకు పిలిచేదో తెలుసా ?

కార్తీక దీపానికి అందులోని లీడ్ రోల్ వంటలక్క, డాక్టర్ బాబుకి బాగా అలవాటు పడిన మహిళలు.. ఇప్పుడు ఆ సినిమా అయిపోతుండడంతో బెంగ పెట్టుకున్నారు. వంటలక్క మళ్లీ వస్తే బాగుండూ అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ కార్తీకదీపం సీరియల్ యూనిట్ మళ్లీ కార్తీక దీపం 2 ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. అవునండి మీరు విన్నది నిజమే.. కార్తీక దీపం టీమ్ మరో సీరియల్ తో మన ముందుకు వస్తున్నారట. ఆ సీరియల్ కోసం ఇప్పటి నుంచే ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించారట. అచ్చొచ్చినటువంటి కార్తీకదీపం 2 టైటిల్ తోనే ఈ సీరియల్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. అందులో కూడా వంటలక్క, డాక్టర్ బాబు ఉండేవిధంగా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా కార్తీక దీపం 2 పేరు నెట్టింట్లో మారు మ్రోగిపోతుంది. వంటలక్క మేనియా ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్ ఎక్కడ పడితే అక్కడ కనిపించడం విశేషం.  

Also Read :  ఫారెన్ సీన్ లో బాలయ్యని కత్తులతో పొడుస్తుంటే పోలీసులు వచ్చి ఏం చేశారో తెలుసా ?

Visitors Are Also Reading