కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో.. సికింద్రాబాద్, తిరుపతినగరాలలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఐటీ ఎగుమతులు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు సంబంధించి.. భారతదేశం మరింత పురోగతిని సాధించేందుకు అవసరమైన మానవ వనరుల అభివృద్ధి దిశగా తెలుగు రాష్ట్రాల్లో రెండు కీలక కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement
ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో వందల కొద్దీ నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఉన్నప్పటికీ, ఆయా రంగాలలో అత్యున్నతస్థాయి ప్రమాణాలతో కూడిన నైపుణ్య శిక్షణను అందించే కేంద్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధిత రంగాలలో అత్యున్నతస్థాయి శిక్షణను అందించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ) సెంటర్ల ఏర్పాటుకోసం కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో పలుమార్లు చర్చించారు. దీనిపై చర్చించిన తర్వాత మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుని ఈ సెంటర్లను సికింద్రాబాద్, తిరుపతిల్లో ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించింది.
Also Read : శ్రీశైలంను వదలని చిరుతలు.. మరోసారి సత్రాలకు సమీపంగా పులి..!