Home » తెలంగాణ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. మ‌రో 2,440 ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి

తెలంగాణ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. మ‌రో 2,440 ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి

by Anji
Ad

తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు శుభ‌వార్త అనే చెప్పాలి. ఇటీవ‌ల గ్రూప్‌-1 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం విధిత‌మే. గ్రూప్‌-1 నోటిఫికేష‌న్ తో పాటు పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల భ‌ర్తికి నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. తాజాగా మ‌రో 2,440 ఉద్యోగాల భ‌ర్తికి రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. విద్యాశాక, ఆర్కైవ్స్ శాఖలో ఉద్యోగాల భ‌ర్తీకి అనుమ‌తి ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Advertisement

ఇంట‌ర్మీడియ‌ట్ క‌మిష‌న‌ర్ ప‌రిధిలో 1,523 పోస్టులు ఉన్నాయి. ఇందులో 1,392 మంది జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ పోస్టులు కాగా.. 40 లైబ్రేరియ‌న్‌, 91 ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్ పోస్టుల భ‌ర్తీకి అనుమ‌తులు ఇచ్చారు. ఆర్కైవ్స్ విభాగంలో 14 పోస్టుల భ‌ర్తీకి అనుమ‌తిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసారు. సాంకేతిక విద్యాశాఖ క‌మిష‌న‌ర్ ప‌రిధిలో 359 పోస్టులున్నాయి. ఇక అందులో 247 లెక్చ‌ర‌ర్ పోస్టుల‌తో పాటు 14 ఇన్‌స్ట్ర‌క్ట‌ర్, 31 లైబ్రేరియ‌న్, 5 మాట్ర‌న్, 25 ఎల‌క్ట్రిషియ‌న్, 37 ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు.

Advertisement

అదేవిధంగా క‌ళావాల విద్యావిభాగంలో 544 పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తిని ఇచ్చింది. అందులో 391 లెక్చ‌ర‌ర్ పోస్టులు, 24 లైబ్రేరియ‌న్, 29 ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్ పోస్టులున్నాయి. ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా పోస్టుల భ‌ర్తీకి ఆర్థిక శాఖ అనుమ‌తిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. మ‌రొక 2,440 ఉద్యోగాల భ‌ర్తీకి ఆర్థిక శాఖ అనుమ‌తి ఇచ్చింద‌న్న మంత్రి హ‌రీశ్ రావు ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఇప్ప‌టివ‌ర‌కు 49, 428 ఉద్యోగాల భ‌ర్తీకి అనుమ‌తిచ్చిన‌ట్టు తెలిపారు.

Also Read : 

విమానంలో ప్ర‌యాణించే వారికి గుడ్‌న్యూస్‌.. ఇక ఆ రుసుము చెల్లించాల్సిన అవ‌స‌ర‌మే లేదు..!

విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ డ్యాన్స్ మీరు చూశారా..? సోష‌ల్ మీడియాలో వైర‌ల్..!

 

Visitors Are Also Reading