Home » ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘సలార్’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘సలార్’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

by Anji
Ad

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ రిలీజ్ డేట్ ని మేవీ మేకర్స్ తాజాగా ప్రకటించారు. డిసెంబర్ 22, 2023న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు తెలుపుతూ వాట్సాప్ ఛానల్ లో పోస్ట్ చేశారు హోంబలే ఫింలీస్ వారు. దీంతో ప్రభాస్ అభిమానులందరూ చాలా సంబురపడుతున్నారు.

Advertisement

క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన సలార్ మూవీ అనూహ్యంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తామంటూ ఎట్టకేలకు సలార్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఆదిపురుష్ మూవీ తరువాత ప్రభాస్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. సలార్ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా అలరించి మూవీపై మంచి హైప్ పెంచింది. హీరోని ఎలివేట్ చేస్తూ.. ప్రముఖ నటుడు టూనూ ఆనంద్ చెప్పిన సింపుల్ ఇంగ్లీష్ డైలాగ్స్, యాక్షన్ విజువల్స్ ప్రేక్షకులతో అదరహో అనిపించాయి.

Advertisement

దాదాపు 24 గంటల్లోనే 83 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొని ఇది రికార్డునే క్రియేట్ చేసింది. పవర్ పుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తున్నారు. జగపతి బాబు, ఈశ్వరిరావు, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. మరోవైపు తాజాగా సలార్ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించడంతో సోషల్ మీడియాలో మూడు హ్యాష్ ట్యాగ్ లు ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఎక్స్ లో ప్రభాస్, సలార్, సీజ్ ఫైర్(SalaarCeaseFire)  హవానే కొనసాగుతోంది.  డిసెంబర్ 22న విడుదల కాబోతున్న సలార్ మూవీ ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

RRR, పుష్ప మూవీస్ పై సంచలన కామెంట్స్ చేసిన నటుడు.. నెటిజన్స్ ఏమంటున్నారంటే..?

ఎన్టీఆర్ మూవీ మేనియాలో కొట్టుకుపోయిన చిరంజీవి సినిమా ఏదో మీకు తెలుసా ?

Visitors Are Also Reading