Home » ప్రభాస్, అనుష్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇన్నాళ్లకు ఆ ముచ్చట తీరనుంది..!

ప్రభాస్, అనుష్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇన్నాళ్లకు ఆ ముచ్చట తీరనుంది..!

by Bunty
Ad

ప్రభాస్-అనుష్క జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురు చూస్తుంటారు. ప్రభాస్-అనుష్క చూడ చక్కనైన జంట. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు. వీరిద్దరు కూడా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట.

Advertisement

కానీ జాతకాలు కలవకపోవడంతో కృష్ణంరాజు గారు వీరి వివాహాన్ని రద్దు చేశారట. దీంతో వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోలేదు. వీరిద్దరి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి 2 వంటి సినిమాలు వచ్చాయి. అయినప్పటికీ వీరిద్దరి కాంబినేషన్లో మళ్లీ సినిమాలు రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారట. దీంతో వీరు ప్రేక్షకులకు మంచి శుభవార్తను అందించారు. వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కాదు ఏకంగా రెండు సినిమాలు రాబోతున్నాయట. ప్రస్తుతానికి అనుష్క పెద్దగా సినిమాలు చేయడం లేదు.

Advertisement

కేవలం ఒకే ఒక సినిమాలో నటిస్తోంది. ఇక అనుష్క… ప్రభాస్ తో రెండు సినిమాలు చేసిన తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పనుందట. మారుతి, ప్రభాస్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారట. ముగ్గురు హీరోయిన్స్ ఉన్నప్పటికీ మారుతీ ఓ కీ రోల్ కోసం అనుష్కను సంప్రదించారట. దానికి అనుష్క కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. డైరెక్టర్ క్రిష్… ప్రభాస్ తో ఓ భారీ సినిమాను ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్-అనుష్క జంటగా నటించనున్నారట. ఇక ఈ రెండు సినిమాల తర్వాత అనుష్క సినిమాలకు పూర్తిగా దూరం కానుందట. ఈ విషయం తెలిసిన అనుష్క అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఇవి కూడా చదవండి

“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !

హర్మన్‌ప్రీత్‌ను తప్పుబట్టిన అఫ్రిది..ట్రోలింగ్ చేస్తున్న ఇండియన్స్ !

అంతా తొండాటే…. పేరుకే పాకిస్తాన్ యువ జట్టు… అందరూ అంకుల్సే ?

Visitors Are Also Reading