మెగా అభిమానులకు ఓ శుభవార్త. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమా తరువాత చేస్తున్న సినిమా ఆర్సీ 15 దర్శకుడు శంకర్ టాలీవుడ్ హీరో పవర్‌స్టార్ రామ్‌చరణ్ తో పాటు ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ కొనసాగుతుంది. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథను అందించారు. అయితే ఆర్సీ 15 సినిమాలో రామ్‌చరణ్ త్రిబుల్ రోల్లో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా టైటిల్ కూడా ఇటీవలే దర్శకుడు శంకర్ లాక్ చేసినట్టు సమాచారం.
Advertisement
తాజాగా ఈ చిత్రం టైటిల్‌కు సంబంధించిన ఆసక్తికరమైన న్యూస్ ఒకటి ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి తొలుత సర్కారోడు అనే టైటిల్ శంకర్ టీమ్ పరిశీలిస్తుందట. ప్రస్తుతానికి ఈ న్యూస్ వైరల్ అవుతున్నప్పటికీ దీనిపై మాత్రం అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. సర్కారోడు, అధికారి అనే టైటిళ్లను పరిశీలన చేస్తోంది. ఇక ఫైనల్‌గా అధికారి అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రి లోని అందమైన ప్రదేశాల్లో కూడా నిర్వహించారు. పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజోలు సుందరి అంజలి, కన్నడ యాక్టర్ జయరామ్, టాలీవుడ్ యాక్టర్ నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చరణ్ కు జోడిగా బ్యూటిపుల్ హీరోయిన్ కియారా అద్వాని నటిస్తుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
Advertisement
ఈ పిక్సర్ పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. విడుదలకు ముందే ఈ చిత్ర నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE చానెల్ దాదాపు రూ. కోట్ల రూపాయల వరకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ చిత్రానికి స్ట్రీమింగ్ భాగస్వామిగా ZEE5 ఓటీటీతో డీల్ కుదుర్చుకుందని తెలుస్తోంది. ఆర్సీ 15 సినిమా షూటింగ్ లో తాను చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు రామ్ చరణ్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు. దర్శకుడు శంకర్ ఫ్యాన్ బాయ్‌గా సినిమాలో తన పాత్ర పరిధి మేరకు నటిస్తున్నానని చెప్పారు. శంకర్ దర్శకత్వంలో పని చేయడం ఆనందంగా ఉన్నదని పేర్కొన్న చరణ్ కచ్చితంగా సినిమా చాలా బాగుంటుందని తెలిపారు.