తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు మంత్రి గంగుల కమలాకర్ బుధవారం ఓ శుభవార్త చెప్పారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు రానున్న వేళ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తుందని తెలిపారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వార్షిక ఆదాయం రూ.5లక్షలలోపు ఉన్నవారు ఈరోజు నుంచి ఈనెల 16 లోపు ఆన్‌లైన్‌లో https://studycircle.cgg.gov.in, https://mjpabcwreis.cgg.gov.in వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
Advertisement
Advertisement
ఏప్రిల్ 16న ఆన్‌లైన్‌లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు. అందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఈనెల 21 నుంచి 1.25,000 మందికి ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభిస్తామని చెప్పారు. ఇందులో 25వేల మందికి నేరుగా మిగతా లక్ష మందికి హైబ్రిడ్ విధానంలో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. 16 స్టడీ సర్కిళ్లు, 103 స్టడీ సెంటర్ల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించారు. ప్రజాప్రతినిధులు, ఎన్జీవోలు ముందుకు వచ్చి మౌళిక వసతులు సమకూరిస్తే.. మరిన్ని స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు.
అదేవిధంగా గ్రూపు-1,గ్రూపు-2 రాసే 10వేల మంది అభ్యర్థులకు స్టైఫండ్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. గ్రూపు-1 అభ్యర్థులకు 6 నెలల పాటు నెలకు రూ.5వేలు, గ్రూపు-2 అభ్యర్థులకు మూడు నెలల పాటు నెలకు రూ.2వేలు, ఎస్సై అభ్యర్థులకు నెలకు రూ.2వేలు స్టైఫండ్ ఇవ్వనున్నట్టు చెప్పారు.
Also Read : బంగారాన్ని క్రాస్ చేసిన ఎర్ర బంగారం.. ఎనుమామూల మార్కెట్‌లో ధర ఎంతంటే..?