వ్యవసాయం కోసం రూ.3లక్షల వరకు స్వల్పకాలిక రుణాలపై 1.5 శాతం వడ్డీ రాయితీని కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. రూ.3లక్షల వరకు రుణాలు తీసుకునే రైతులకు వడ్డీలో 1.5 శాతం రాయితీ లభిస్తుంది. వ్యవసాయ రంగంలో తగిన రుణం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ పరిమితిని ప్రభుత్వం రూ.5లక్షల కోట్లకు పెంచింది. వడ్డీ రాయితి పథకం కింద ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కంప్యూటరైజ్డ్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలు వంటి రుణ సంస్తలు 2022-23 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరాలకు రైతులకు అందించబడ్డాయి.
రూ.3లక్షల వరకు స్వల్పకాలిక రుణాలకు 1.5 శాతం వడ్డీ రాయితీ ఇవ్వబడుతుంది. వడ్డీ రాయితీ కింద 2022-23 నుంచి 2024-25 మధ్యకాలంలో రూ.34,856 కోట్ల అదనపు బడ్జెట్ కేటాయింపులు అవసరమని అధికారిక ప్రకటన తెలిపింది. వడ్డీ రాయితీ పెరుగుదల వ్యవసాయ రంగానికి రుణ ప్రవాహాన్ని పెంచుతుంది. అదేవిధంగా ఆర్థిక సంస్థల ఆర్థిక ఆరోగ్యం, రుణ సాధ్యతను నిర్ధారిస్తుంది. సకాలంలో రుణం చెల్లింపులపై రైతులు 4 శాతం వడ్డీతో స్వల్పకాలిక రుణాన్ని పొందడం కొనసాగుతుంది. వడ్డీ రాయితీ పెరుగుదల వ్యవసాయ రంగానికి రుణ ప్రవాహాన్ని పెంచుతుంది.
Advertisement
Advertisement
ఆర్థిక సంస్థల ఆర్థిక ఆరోగ్యం, రుణ సాద్యతను నిర్దారిస్తుంది. సకాలంలో రుణం చెల్లింపుపై రైతులు 4 శాతం వడ్డీతో స్వల్పకాలిక రుణాన్ని పొందడం కొనసాగుతుంది. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ కింద ప్రభుత్వం మరో రూ.50వేల కోట్ల వ్యయాన్ని పెంచింది. ఇప్పుడు కింద మొత్తం క్రెడిట్ పరిమితి రూ.5లక్షల కోట్లకు పెరిగింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇది హోటళ్లు సంబందిత రంగాలకు ఊతమిస్తుంది.
Also Read :
మహానటి సినిమాలో తొలుత అనుకున్న హీరోయిన్ గురించి మీకు తెలుసా..?
మీ పిల్లలను దోమల నుంచి రక్షించాలంటే ఈ చిట్కాలను పాటించండి..!