Home » బాలయ్య అభిమానులకు శుభవార్త.. ఆ హిట్ సాంగ్ రిమిక్స్..!

బాలయ్య అభిమానులకు శుభవార్త.. ఆ హిట్ సాంగ్ రిమిక్స్..!

by Anji
Ad

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న విధితమే. #NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లింది. హీరో తారకరత్న అకాల మరణంతో షూటింగ్ కొద్ది రోజుల పాటు వాయిదా పడింది. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. 

Advertisement

NBK 108 చిత్రానికి మోస్ట్ వాంటెడ్ సంగీత దర్శకుడు ఎస్.థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. డిక్టేటర్, అఖండ, వీరసింహారెడ్డి సినిమాలను చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ అందించిన థమన్.. మరో సూపర్ హిట్ ఆల్బమ్ ఇవ్వడానికి  కృషి చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే సినిమాలో ఓ రిమిక్స్ సాంగ్ ని పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. అది కూడా బాలయ్య సొంత పాటనే రిమిక్స్ చేయనున్నట్టు చెప్పుకొచ్చారు. బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల్లో సమరసింహారెడ్డి, ఈ సినిమాలో అందాల ఆడబొమ్మ అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వరబ్రహ్మ మణిశర్మ కంపోజిషన్ లో ప్రముక గాయనీ గాయకులు ఉదిత్ నారాయణ-సుజాత కలిసి ఆలపించిన ఈ పాట, ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఈ సూపర్ హిట్ సాంగ్ ని ఇప్పుడు NBK 108 సినిమా కోసం రీమేక్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. 

Advertisement

Also Read :  తారకరత్నకు మరో జన్మ ఉండబోతుందా..ఆయన జాతకం ప్రకారం చూస్తే..!!

తెలుగు సినిమాలలో రీమిక్స్ పాటలు పెట్టడం కొత్తేమి కాదు. ఇటీవల ఈ ట్రెండ్ కాస్త తగ్గింది. అమిగోస్ సినిమాలోని ఎన్నో రాత్రులొస్తాయి కానీ అనే బాలయ్య సినిమాలోని పాటను కళ్యాణ్ రామ్ రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే.బాలయ్య సొంత సినిమాలోని పాటను తన కొత్త చిత్రం కోసం రీమిక్స్ చేస్తున్నారని పేర్కొంటున్నారు. మామూలుగా చిన్న మీడియం రేంజ్ హీరో ఓల్డ్ సాంగ్స్ రీమిక్స్ చేయడం మనం చేస్తుంటాం. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్యని ఇంతకు ముందు ఎన్నడు చూడని పాత్రలో చూపించబోతున్నట్టు దర్శకుడు అనీల్ రావిపూడి హామీ ఇచ్చారట. ఈ చిత్రంలో బాలయ్య కూతురిగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుందని టాక్. బాలీవుడ్ స్టార్ అర్జున్ రామ్ పాల్ ని విలన్ గా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అఖండ, వీరసింహారెడ్డి వంటి బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలయ్య అనిల్ రావిపూడితో కలిసి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. 

Also Read :  రాత్రిపూట హీరోల గదులకు నేను వెళ్ళను-కంగానా

Visitors Are Also Reading