Home » టీ20 కెరీర్‌లోనే మొదటిసారి గోల్డెన్ డకౌట్.. కోహ్లీ ఖాతాలో మరో బ్యాడ్ రికార్డ్..

టీ20 కెరీర్‌లోనే మొదటిసారి గోల్డెన్ డకౌట్.. కోహ్లీ ఖాతాలో మరో బ్యాడ్ రికార్డ్..

by Anji
Ad

భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మూడో మ్యాచ్ జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఈ నిర్ణయం రోహిత్ సేనకు అంతగా కలసిరాలేదు. పవర్ ప్లేలోపే 4 వికెట్లను కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం భారత జట్టు 10 ఓవర్లలో నాలుగు వికెట్లకు 61 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ రోహిత్ శర్మ, రింకూ సింగ్ ఉన్నారు. యశస్వి జైస్వాల్‌ను 4 పరుగుల వద్ద, విరాట్ కోహ్లీ (0), సంజూ శాంసన్ (0)లను ఔట్ చేసిన ఆఫ్ఘాన్ బౌలర్ ఫరీద్ అహ్మద్‌ భారత్‌కు భారీ షాక్ ఇచ్చాడు.

Advertisement

Advertisement

ఇక ఆ తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో శివమ్ దూబే (1) వికెట్ కీపర్ రహ్మానుల్లా గుర్బాజ్ చేతికి చిక్కాడు.టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్‌తో ఔట్ కావడంతో బెంగళూరు ప్రేక్షకులు షాక్‌లో ఉండిపోయారు. కోహ్లీ తన టీ20 కెరీర్‌లో తొలి గోల్డెన్ డక్‌ను నమోదు చేశాడు. T20Iలలో కోహ్లి ఇన్నింగ్స్‌లో ఎటువంటి పరుగులు చేయకపోవడం ఇది 5వసారి మాత్రమే. ఇది ఈ భారత స్ఠార్ బ్యాట్స్‌మన్‌కు అరుదైన సంఘటనగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 35 ఏళ్ల విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో తన T20I పునరాగమనం చేశాడు. 2022 ఆస్ట్రేలియాలో జరిగిన T20 ప్రపంచ కప్ తర్వాత భారతదేశం తరపున పొట్టి ఫార్మాట్‌లో కనిపించకపోవడం గమనార్హం. 

 

Visitors Are Also Reading