Home » Ram Charan : రామ్ చరణ్‌కు గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు

Ram Charan : రామ్ చరణ్‌కు గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు

by Bunty

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చిరంజీవి లాగే స్టార్ హీరోగా ఎదిగాడు. చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్…. మగధీర సినిమాతో బంపర్ విజయాన్ని అందుకున్నాడు.

ramcharan

మగధీర సినిమా తర్వాత రామ్ చరణ్ కెరీర్ ఓ రేంజ్ కు వెళ్ళింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా కూడా ఎదిగాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇది ఇలా ఉండగా…మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అంతర్జాతీయ స్థాయిలో మరో గుర్తింపు దక్కింది. అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్ 2023లో గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు ఆయనను వరించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని సినీ ఇండస్ట్రీల్లో ప్రతిభ చాటిన కళాకారులకు ఈ అవార్డులను అందజేస్తారు.

RRR సినిమాతో చరణ్ వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉండగా… మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన ఇటీవల కాలంలోనే తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ మరియు ఉపాసనలకు ఓ పండంటి ఆడబిడ్డ పుట్టింది. హైదరాబాద్ లోని ప్రముఖ అపోలో ఆసుపత్రిలో… ఆడబిడ్డ కు జన్మనిచ్చింది ఉపాసన.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading