కొత్త సంవత్సరానికి నాంది పలకడానికి కనీసం పది రోజుల సమయం కూడా లేదు. కొత్త సంవత్సరంలో చాలామంది కొత్త కొత్త వస్తువులు కొనాలని భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలైతే గోల్డ్ కొనడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా కొత్త సంవత్సరం బంగారం కొనాలనుకునే వారికి ఇది బాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. కొత్త సంవత్సరంలో బంగారం రేట్లు భారీగా పెరగనున్నాయని నిపుణులు అంటున్నారు. మరి దీనికి కారణాలు ఏంటో చూద్దాం..
Advertisement
also read:18 Pages Review : ’18 పేజెస్’ మూవీ రివ్యూ..నిఖిల్ ఖాతాలో మరో సినిమా
ప్రపంచ కేంద్ర బ్యాంకులు కీలకమైన పాలసీ రేట్లను పెంచడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో అనిచ్చితి పరిస్థితులు ఏర్పడి బంగారం ధర పెరుగుదలకు దారి తీయవచ్చని అంటున్నారు. ద్రవయోల్బణాన్ని కట్టడి చేయడం కోసం కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతున్న విషయం మనందరికీ తెలిసిందే. 2022 లోనే బంగారం ధరలు 10% పెరిగాయి. అయితే వచ్చే 2023 నూతన సంవత్సరంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఏకంగా బంగారం ధర 62 వేలకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
Advertisement
ప్రస్తుతం mcx మార్కెట్లో బంగారం 10 గ్రాములకు 55 వేల రూపాయలు ఉంది. అయితే 2023లో ఈ ధర మరో 7 వేల రూపాయలు ఎక్కువగా పెరగవచ్చని సమాచారం. కాబట్టి బంగారం కొనాలని ఆశపడే వారికి ఇది షాకింగ్ న్యూస్ గా చెప్పవచ్చు. కేడీయు కమోడిటీస్ డైరెక్టర్ అజయ్ కేడియా మాట్లాడుతూ.. 2023లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని అన్నారు. 10 గ్రాముల ధర 62,000 మార్క్ దాటవచ్చని ఆయన అంచనా వేశారు. కాబట్టి బంగారం కొనాలనుకునేవారు ఈ లోపే బంగారం కొంటే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
also read: