Home » సత్యదేవ్ “గాడ్సే” మూవీ టీజర్ రిలీజ్

సత్యదేవ్ “గాడ్సే” మూవీ టీజర్ రిలీజ్

by Bunty
Ad

విభిన్న కథా చిత్రాలతో అలరించే హీరోల్లో సత్యదేవ్ ఒకరు.ఇటీవల “స్కైలాబ్” అనే కొత్త తరహా కథతో అలరించిన సత్యదేవ్ గాడ్సే గా రాబోతున్నాడు. దర్శకుడు గోపి గణేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సామాజిక అంశాలు,నేటి పరిస్థితులకు అద్దం పట్టేలా తెరకెక్కిస్తున్నారు ప్రస్తుతం సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్న గాడ్సే ప్రమోషన్స్ కూడా ప్రారంభించింది.ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా టీజర్ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేసింది చిత్ర బృందం.

Advertisement

Advertisement

ఈ టీజర్ విడుదల చేస్తూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుత ట్వీట్ చేశారు మెగాస్టార్. విడుదల చేసిన టీజర్ తో సినిమాపై ఆసక్తి పెంచే లా ఉంది.సత్యదేవ్ చెప్పే డైలాగులు పవర్ ఫుల్ గా ఉన్నాయి. ‘ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకో లేనంత కాలం మోసపోతూనే ఉంటారు’ అంటూ సత్యదేవ్ చెప్పే డైలాగ్ టీజర్ ప్రారంభమవుతోంది.

అలాగే ‘సేవ చేస్తున్నందుకు 100,వేల,లక్షల,కోట్లు ఎలా వస్తున్నాయిరా?’ అనే డైలాగ్ ప్రజలను ఆలోచింపజేసేలా ఉంది.సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది. నాగబాబు తనికెళ్ల భరణి, పృథ్వి కీలక పాత్రలు పోషించారు.ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ త్వరలో ప్రకటించడం ఉన్నట్లు తెలుస్తోంది.

Visitors Are Also Reading