Home » అమ్మాయిలూ… అబ్బాయిని పెళ్లి చూపుల్లో మరచిపోకుండా… ఈ ప్రశ్న అడగాలి…!

అమ్మాయిలూ… అబ్బాయిని పెళ్లి చూపుల్లో మరచిపోకుండా… ఈ ప్రశ్న అడగాలి…!

by Sravya
Ad

ఒకసారి పెళ్లి జరిగితే, జీవితాంతం సంతోషంగా భార్యాభర్తలు కలిసి ఉండాలి. వైవాహిక జీవితంలో భార్యాభర్తలు మధ్య గొడవలు కచ్చితంగా వస్తాయి. కానీ సర్దుకుంటూ వెళ్ళిపోతే జీవితం బాగుంటుంది. పెళ్లి జరగడానికి ముందు పెళ్లి చూపులు జరుగుతాయి కదా.. ఆ టైంలో అమ్మాయిలు కచ్చితంగా అబ్బాయిని ఈ ప్రశ్న అడగాలని డాక్టర్ వికాస్ దివ్య కీర్తి 1996 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అన్నారు. ఈయన హోమ్ మంత్రిత్వ శాఖలో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. తర్వాత ఉద్యోగానికి రిజైన్ చేసేసి రచయితగా ఉపాధ్యాయుడుగా ప్రేరణాత్మక వ్యక్తిగా గుర్తింపును పొందారు. అయితే ఈయన అమ్మాయి పెళ్లి చూపుల్లో అబ్బాయిని మీరు చివరిసారి ఎప్పుడూ ఏడ్చారు, సందర్భం ఏది అని అడగాలట.

Advertisement

Advertisement

 

ఒకవేళ అబ్బాయి నేను ఎప్పుడూ ఏడవలేదు చిన్నప్పుడు ఎప్పుడో ఏడ్చాను అని చెప్తే అతని ని పెళ్లి చేసుకోవద్దని చెప్పారు. పరిస్థితుల్ని బట్టి ఏడ్చిన అబ్బాయిలని పెళ్లి చేసుకోవాలని సలహా ఇచ్చారు. చాలా సంవత్సరాల నుండి ఏడవని వ్యక్తి చాలా కఠినంగా ఉంటాడట. అతని మనసు ఒక స్టేజ్లో బండ రాయిలా మారిపోతుంది భావోద్వేగానికి గురైనప్పుడు ఆక్సిటోసిన్, ఎండోర్ఫిన్ రసాయనాలు రిలీజ్ అవుతాయి. దీంతో కన్నీళ్లు వస్తాయి తర్వాత మనిషి యొక్క మనసు తేలికగా అవుతుంది. ఏడవడం మానసిక బాధని బాగా తగ్గిస్తుంది. ఒకవేళ జీవితంలో ఎడవలేదు అని చెప్పినట్లయితే అటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోవద్దని ఆయన సూచించారు.

Also read:

Visitors Are Also Reading